Site icon NTV Telugu

ఆకట్టుకుంటున్న ‘ధమాకా’ ట్రైలర్

కరోనా కారణంగా డైరెక్ట్ గా డిజిటల్ లో విడుదల కాబోతున్న మరో బాలీవుడ్ సినిమా ‘ధమాకా’. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ సినిమాను ముందు థియేట్రికల్ గా విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ‘ప్రశాంతంగా ఉండండి. అర్జున్ పాఠక్‌ పై భరోసా ఉంచండి. #ధమాకా లోడ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 19 న వస్తున్నాము’ అని ట్రైలర్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ చేసింది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ‘ధమాకా’ సినిమా టెలివిజన్ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిది.

ఒక బ్రిడ్జ్ ని పేల్చిన ఉగ్రవాదిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ ఎలాంటి బెదిరింపులు అందుకున్నాడు. ఆ తర్వాత అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఈ సినిమా కథాంశం. కార్తీక్ ఆర్యన్ తో పాటు మృణాల్ ఠాకూర్, అమృత సుభాష్ ముఖ్య పాత్రధారులు. 2013లో వచ్చిన ‘ద టెర్రర్ లైవ్’ అనే కొరియన్ సినిమా ఆధారంగా ‘ధమాకా’ను తెరకెక్కించారు. ‘నీర్జా’ ఫేమ్ రామ్ మాధ్వాని దీనికి దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా, అమిత మద్వానీ, రామ్ మద్వాని నిర్మించిన ఈ సినిమా నవంబర్ 19 న నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదల కానుంది.

Exit mobile version