దేవిశ్రీ ప్రసాద్..టాలీవుడ్ సౌత్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్‌లో ఆయకూడా ఒకరు. ‘దేవి’ సినిమాతో మొదలు గత కొన్నేళ్లుగా తన సంగీతంతో మ్యుజిల్ లవర్స్‌ను అలరిస్తున్నే ఉన్నాడు. ఎలాంటి జోనర్ సినిమా అయినా సరే, దానికి తగ్గట్టుగా పాటలు అందించగల ట్యాలెంట్ తో ఓ స్పెషాలిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన సంగీతంలో ఎంత ఊపు ఉంటుందో.. స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే కూడా అంతే ఉత్సాహం ఉంటుంది. అందరిలా కాకుండా ఆసక్తికర విషయాలు మాట్లాడుతూ.. కొన్నిసార్లు గట్టిగా కౌంటర్లు కూడా వేస్తుంటాడు. అయితే..
Also Read : Vijay Sethupathi: ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా..
కర్ణాటక రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి.. హీరోగా పరిచయం అవుతున్న ‘జూనియర్’ సినిమాకు, దేవినే సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సాంగ్ లాంచ్ బెంగళూరులో జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన దేవి దర్శకులను ఆకాశానికెత్తేశారు.. ‘ఒక మంచి సినిమా చేయాలంటే దర్శకుడే అత్యంత కీలకం. నటీనటులను ఎంచుకుని, నిర్మాతను ఒప్పించి.. టెక్నీషియన్లను సెట్ చేసుకుని తొలి రోజు నుంచి రిలీజ్ వరకు కష్టపడుతూనే ఉండేవాడే దర్శకుడు. అలాంటి ప్రతి ఒక దర్శకుడికీ మనం ప్రేమ, గౌరవం ఇవ్వాలి. కొత్త దర్శకుడైనా సరే, పెద్ద దర్శకుడైనా సరే..మూవీ ఫ్లాప్ అయితే ముందుగా దర్శకుడినే మనం నిందిస్తాం. చెప్పాలంటే డైరెక్టర్‌ల కష్టం వల్లే మనందరం ఇక్కడ ఉన్నాం. మన జీవితాలను ఇంత అందంగా మారుస్తున్న దర్శకులందరికీ హ్యాట్సాఫ్’ అని దేవి అన్నాడు. ప్రజంట్ ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
