NTV Telugu Site icon

Devara : దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. దూకే ధైర్యమ జాగ్రత్త..

Untitled Design (18)

Untitled Design (18)

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం “దేవర”. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం నుండి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్, పాటలీజు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు మ్యూజిక్ కాపీ అన్న ఆరోపణలు వస్తూనే మరోవైపు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి దేవర సాంగ్స్. సెకండ్ సింగిల్ గా వచ్చిన చుట్టమల్లే సాంగ్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సినిమాపై అంచనాలు పెంచేసింది.

Aalso Read: Devara : దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్.. రికార్డుల ‘రారాజు దేవర మహారాజు’

ఈ సెప్టెంబరు 27న విడుదల కానున్న దేవర ప్రమోషన్స్ కు శశ్రీకారం చుట్టారు మేకర్స్. దేవర ట్రైలర్ ఈ సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నటు తెలుస్తోంది. ట్రైల‌ర్ నిడివి దాదాపుగా 2 నిమిషాల 45 సెక‌న్లు ఉన్న‌ట్లు టాక్‌. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ను నార్త్ నుండి స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అందులో భాగంగా ముంబై లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి అక్కడ డేరా తట్రైలర్ ను రిలీజ్ చేసేలా ఆలోచన చేస్తున్నారు దేవర నిర్మాతలు. ఆ వెంటనే మిగిలిన రెండు సాంగ్స్ ను రిలీజ్ చేసి భారీ ఎత్తున సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ప్రీమియర్స్ వేసేలా చూస్తున్నారు. దేవర ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Show comments