బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ లో డెబ్యూ మూవీగా దేవరాలో నటించాడు. ఆ మధ్య ఆది పురుష్ లో రావణుడిగా నటించాడు కానీ అది హిందీ సినిమాగా పరిగణించాలి. ఓన్లీ హీరో తప్ప మిగతా అంత బాలీవుడ్ నటులే ఉంటారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది దేవర. విలన్ రోల్ లో తనదైన శైలిలో సైఫ్ మెప్పించాడు. తనపాత్ర పరిధి మేరకు సైఫ్ బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ బాలీవుడ్ నటుడు ఇటీవల ఓ ఆంగ్ల వెబ్సైట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు.
Also Read : Devara : ఆ ఒక్కటి చేసి ఉంటే ఇంకాస్త బాగుండేది..ఏంటంటే..?
ఆ కార్యక్రమంలో సైఫ్ మాట్లాడుతూ ” తెలుగు ప్రేక్షకులు సినిమాలను చాలా బాగా ఇష్టపడతారు, సినిమా చూసేటప్పుడు వాళ్లు లీనమై చూస్తారు. టాలీవుడ్ ఆడియెన్స్ తమ తమ అభిమాన హీరోలను దేవుళ్లలా చూసుకుంటారు. తెలుగు దర్శకులు వాళ్లు తీసే కథ, కథనంపై స్పష్టమైన, బలమైన అవగాహన కలిగి ఉంటారు. బాహుబలి సినిమాను వారు తెరకెక్కించిన విధానం అద్భుతం. పౌరాణిక మరియు చరిత్రాత్మకమైన సినిమాలను చాలా బాగ తీస్తారు. నేను తెలుగులో నటించిన ‘దేవర’లోని నా పాత్ర డైలాగ్స్ విషయంలో కొరటాల శివ చాలా సాయం చేశారు. ప్రతి మాట ఎలా పలకాలో కూడా నేర్పించారు. నేను ముంబై నటుడినే అయినా కూడా తెలుగులో చాలా కంఫర్ట్‌గా పనిచేశాను. దక్షిణాది ఇండస్ట్రీ నుండి వచ్చిన ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయ్యాయి. అక్కడి దర్శకులు హీరోలను చూపించిన తీరు నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది’ అని అన్నాడు.