NTV Telugu Site icon

Devara : దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్.. రికార్డుల ‘రారాజు దేవర మహారాజు’

Untitled Design (13)

Untitled Design (13)

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘దేవర’. దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్‌ ఇండియా భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత వీరద్దరు దేవర కోసం జతకట్టారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ రికార్డ్ వ్యూస్ రాబడుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Also Read : G.O.A.T : విజయ్ G.O.A.T మొదటి రోజు కలెక్షన్స్.. ఎదో తేడాగా ఉందే..?

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సిస్‌లోనూ భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. కాగా ఒవర్సీస్ లో అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ అదరగొడుతుంది ఈ చిత్రం.గత రెండు మూడు రోజుల క్రితం ప్రీ సేల్స్‌ స్టార్ట్ చేసారు. USA అడ్వాన్స్ బుకింగ్స్ $561K, CANADA $40K రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే 813 షోస్ కు గాను $601,725 రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం రీసెంట్బ్లాక్ బస్టర్ కల్కి అడ్వాన్స్ కలెక్షన్స్ ను దాటేశాడు దేవర. ఇంకా రిలీజ్ కు 20 రోజుల ముందుగానే ఈ రికార్డ్స్ నమోదు చేసాడు తారక్.
అంతే కాకుండా USA లో అత్యంత ఫాస్ట్ గా 15 వేల టికెట్స్ బుక్ అయిన చిత్రంగా మరొక రికార్డ్స్ క్రియేట్ చేసింది దేవర. మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ట్ మరికొద్ది రోజుల్లో సప్రారంభించబోతున్నారు మేకర్స్. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Show comments