NTV Telugu Site icon

Devara : జూనియర్ ఎన్టీయార్ ‘దేవర ఓటీటీ’ రిలీజ్ ఎప్పుడంటే..?

Untitled Design (24)

Untitled Design (24)

యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ఆగమనానికి సర్వం సిద్ధమైంది. తెల్లవారుజామున బెన్ ఫిట్ షోస్ తో గ్రాండ్ గా స్టార్ట్ కానుంది దేవర.   ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయిందని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో టెర్రిఫిక్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గ్గట్టుగానే దేవర బుకింగ్స్ ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలో, కర్ణాటక దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి.

Also Read : Devara : మరొక మైలురాయిని చేరుకున్న దేవర.. ప్రీమియర్స్ ఈ రోజే

కాగా దేవర ఓటీటీ స్ట్రీమింగ్ కు ఎన్ని తర్వాత వస్తుందోనని అభిమానులు ఆరాతీయడం మొదలెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల సూపర్ హిట్ సినిమాలు ఇలా రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీ స్త్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అది కాకుండా భారీ సినిమాలు అన్ని విడుదలకు ముందే ఓటీటీ అగ్రిమెంట్స్ చేస్తుండడంతో దేవరను ఎన్ని రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు అనే చర్చ మొదలైంది. దేవర సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో భారీ ధర కు కొనుగోలు చేసారు కాబట్టి త్వరగానే స్ట్రీమింగ్ చేస్తారని రకరకాల టాక్స్ వినిపించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేవర డిజిటల్ ప్రీమియర్ ను రిలీజ్ నైట్ నుండి 8 వారల తర్వాత మాత్రమే తీసుకువచ్చేలా అగ్గ్రిమెంట్స్ చేశారట మేకర్స్. అంటే సుమారు రెండు నెలల ఆ లెక్కన రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత నవంబరులో ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తుంది దేవర