యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో అలనాటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మరొక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన సాంగ్స్ విశేషంగా అలరించగా ఇటీవల రిలీజ్ అయిన దేవర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తాజగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించాలకున్న ఈవెంట్ భారీగా అభిమానులు తరలిరావడంతో రద్దు చేసారు.దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవడంపై భాదపడుతూ అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేసారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ మరొక వీడియో రిలీజ్ చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయి తెలుగు పేక్షకులకు చెప్పాలనుకున్న వ్యాఖ్యలను వీడియో రూపంలో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఏముందంటే ‘ అందరికీ నమస్కారం.ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి, నా మీద ఎంతో ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ కు, అలాగే నన్ను జాను పాప అని పిలుస్తున్న జూనియర్ ఎన్టీయార్ సార్ ఫ్యాన్స్ కు అందరికి నా ధన్య వాదాలు, మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు.అలాగే అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం అలాగే నాకు కూడా. నన్ను ఇంతలా సపోర్ట్ చేసేలా మీరందరు గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. దేవర నా స్టెప్. దర్శకులు శివ సార్, ఎన్టీయార్ సార్ ఈ సినిమాకు నన్ను ఎంపిక చేయడం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. యూనిట్ అందరికి థాంక్యూ” అని అన్నారు