NTV Telugu Site icon

Devara Day 1 Collections: డే 1.. దేవర విధ్వంసం!

Devara Jatharaa Begins

Devara Jatharaa Begins

Devara First Day Collections: ఏ హీరో అయినా సరే.. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ చూడాల్సిందే. రాజమౌళి హీరోలకు ఇదొక బ్యాడ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. కానీ దేవర సినిమాతో సెంటిమెంట్ బ్రేక్ చేశాడు యంగ్ టైగర్. దీంతో.. తనతోనే మొదలైన సెంటిమెంట్‌ను తనే బ్రేక్ చేశాడు.. టైగర్ వన్ మ్యాన్ షో చేశాడు.. కొరటాల సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు.. అంటూ దేవర సక్సెస్‌ను ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మరోవైపు దేవర బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ఊచకోత కోస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అదరగొట్టిన దేవర.. ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా.. ఇండియాలో తొలి రోజు 83.71 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. గ్రాస్ వచ్చేసి వరల్డ్ వైడ్‌గా 154.36 కోట్ల వరకు వచ్చినట్టుగా అంచనాలు ఉన్నాయి.

Balakrishna: బాలయ్య కాళ్ళు మొక్కిన ఐష్

దీంతో సోలోగా ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ వంద కోట్ల ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా దేవర నిలిచింది. అలాగే.. 2024లో డే వన్ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్‌గా దేవర నిలిచింది. ఏపీ తెలంగాణ తొలిరోజు 83.71 కోట్లు, కర్ణాటక 10.03 కోట్లు, తమిళనాడు 2.59 కోట్లు, కేరళ 64 లక్షలు, మిగతా ఇండియా అంతా కలిపి 9.27 కోట్లు, ఓవర్ సీస్ 48.12 కోట్లు(ఇంకా రిపోర్ట్ చేయని లొకేషన్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఫైనల్ గా సినిమా యూనిట్ 172 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ప్రకటించింది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ముందు నుంచి భారీ హైప్ ఉంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి సోలోగా వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్‌కు ముందే సంచలనం సృష్టించిన దేవర.. రిలీజ్ అయ్యాక భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించిన ఈ సినిమాలో.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. మరి లాంగ్ రన్‌లో దేవర ఎంత రాబడుతుందో చూడాలి.

Show comments