NTV Telugu Site icon

Devara: రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తోన్న దేవర సెకండ్ సింగిల్

Untitled Design (82)

Untitled Design (82)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు మేకర్స్. మొదటి భాగం దేవర పార్ట్ 1 నుండి వచ్చిన మొదటి సింగిల్ ఫియర్ సాంగ్ అదిరిపోయింది. తాజాగా సోమవారం దేవర లోని రెండో పాట‌ను విడుద‌ల చేశారు. ‘చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండ‌దు కాసేపు.. అస్త‌మానం నీ లోక‌మే నా మైమ‌ర‌పు.. చేత‌నైతే నువ్వే న‌న్ను ఆపు’ అంటూ సాగింది ఈ పాట.

Also Read: Tollywood: టాలీవుడ్ టాప్ అప్ డేట్స్.. ఒక్క క్లిక్ తోనే..

కాగా సెకండ్ సింగిల్ పై మిశ్రమ స్పందంన వస్తోంది. కొందరు సాంగ్ చాలా బాగుందని చాలా సంవత్సరాల తర్వాత తారక్ రొమాంటిక్ లుక్ లో చూసాం అని, జాన్వీ కపూర్ అదరగొట్టిందని, రామజోగయ్య శాస్తి రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేశారు. మరోవైపు సెకండ్ సింగిల్ లోని మ్యూజిక్ బాగాలేదని, హాలీవుడ్ సాంగ్ లోని మ్యూజిక్ ను యధావిధిగా కాపీ చేసాడని అనిరుధ్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజెన్స్. కానీ వీటన్నిటిని దాటుకుంటూ దేవర దూసుకెళ్తున్నాడు. సాంగ్ రిలీజ్ చేసిన నాటి నుండి నం .1 స్థానంలో ట్రెండింగ్ అవుతూ 25 మిలియన్ల వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇందుకు సంబంధించి అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. త్వరలోనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచే ఆలోచన చేస్తున్నారు నిర్మాతలు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది దేవర.

 

Show comments