NTV Telugu Site icon

Devara : దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. NTR నట విశ్వరూపం..

Untitled Design (46)

Untitled Design (46)

RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన  పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Also Read :   NTR : జూనియర్ ఎన్టీయార్ లైనప్ మాములుగా లేదుగా..

తాజాగా ఈ చిత్రం నుండి మరొక ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. యంగ్ టైగర్ మాస్ సంభవం అనే చెప్పాలి. ఈ చిత్రంలో టైగర్ ద్విపాత్రాభినయం చేసాడు. దేవర పాత్రలో ఎన్టీయార్ చెప్పిన  ” భయం పోవాలంటే దేవుడి కథ వినాలా – భయం రావాలంటే దేవర కథ వినాల”  సముద్రం ఎక్కాల, సముద్రం ఏలాల’ వంటి డైలాగ్స్  ట్రైలర్ కే  హైలెట్ గా నిలిచింది. ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారు అంతే స్థాయిలో అదే రీతిలో గ్రాండ్ స్కేల్ లో ట్రైలర్ కట్ చేసారు. కాగా నేడు సాయంత్రం 6: 00 గంటలకు దేవర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ (HICC) లో భారీ స్థాయిలో జరగబోతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా దర్శకులు త్రివిక్రమ్, SS రాజమౌళి, ప్రశాంత్ నీల్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. అటు దేవరకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మొదటి రోజు సింగిల్ స్క్రీన్స్ లో దేవర 6 షోలు పడనున్నాయి. దేవర ,మానియాతో రెండు రెండు తెలుగు రాష్టాలు ఉగిపోతున్నాయి. చూడాలి దేవర ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో

Devara Release Trailer (Telugu) | NTR | Saif Ali Khan | Janhvi | Koratala Siva | Anirudh | Sep 27