NTV Telugu Site icon

Devara: దేవర ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ..

Untitled Design 2024 08 18t081507.227

Untitled Design 2024 08 18t081507.227

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర, కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతోంది దేవర. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇటీవల సైఫ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన బైరా గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా భాషలలో రాబోతున్న దేవరపై భారీ అంచానాలు ఉన్నాయి. మరోవైపు దేవర థియేట్రికల్ బిజినెస్ కు తీవ్రపోటీ నెలకొంది. ఈ సినిమాను ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read: P.Susheela: ప్రముఖ గాయని పి.సుశీలకు అస్వస్థత..

దేవర ఓవర్సీస్ రైట్స్ దక్కించుకునేందుకు పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీలో నిలిచాయి. భేరసారాలా అనంతరం దేవర ఓవర్శిస్ డీల్ క్లోజ్ చేసారు మేకర్స్. . దేవర చిత్రాన్ని యూఎస్‌లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి. ఇందుకు సంబంధించి అధికారకంగా ప్రకటించారు సదరు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు. దీంతో పాటుగా దేవర ప్రీమియర్స్ ను సెప్టెంబరు 26న ప్రదర్శించబోతున్నట్టు వెల్లడించారు ప్రత్యంగిరా సినిమాస్. మరో వైపు దేవర రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసారు ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. అటు బాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కరణ్ జోహార్ దేవర నార్త్ రైట్స్ కొనుగోలు చేసి భారీ స్థాయిలో రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవరకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Show comments