NTV Telugu Site icon

Devara -Pushpa 2: ‘దేవర’ ఆయుధ పూజ.. ‘పుష్ప 2’ జాతర.. పోతారు మొత్తం పోతారు!

Devara Pushpa

Devara Pushpa

Devara Ayudha Pooja Pushpa 2 Jathara Become Hottopic: ‘దేవర’ సినిమాలో ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఒక ఎత్తైతే.. ఆయుధ పూజ సాంగ్ ఒక ఎత్తు అనేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే.. అదిగో, ఇదిగో అని ఊరిస్తున్నారు తప్ప.. ఈ పాటను మాత్రం రిలీజ్ చేయడం లేదు మేకర్స్. ఇదే హైప్‌తో ఆయుధ పూజను డైరెక్ట్‌గా థియేటర్లోనే రిలీజ్ చేసేలా ఉన్నారు. కానీ థియేటర్ లో ఆయుధ పూజకు అంతా పోతారని అంటున్నారు. అనిరుధ్ ఆ రేంజ్ ట్యూన్ ఇచ్చాడని టాక్. అయితే.. దేవరకు ఆయుధ పూజ ఎంత ఆయువుపట్టో.. పుష్ప 2 సినిమాలో కూడా అలాంటి పాట ఒకటి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయట. ఇప్పటికే పుష్పరాజ్, సూసెకీ సాంగ్ రిలీజ్ అవగా చార్ట్ బస్టర్స్‌ అయ్యాయి.

Devara: మెంటలెక్కిస్తున్న ‘దేవర’.. ఒక్కోటి ఒక్కో డైమాండ్ మావా!

అయితే.. జాతర పాట మాత్రం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. ఎప్పటి నుంచో టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ మాట గట్టిగా వినిపిస్తోంది. కానీ, ఈ పాటను లిరికల్ సాంగ్ రిలీజ్ చేయకుండా.. నేరుగా థియేటర్లలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. జాతర సాంగ్‌ని థియేటర్స్ లోనే ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట. సినిమా రిలీజ్ తర్వాత ఈ సాంగ్ సెన్సేషన్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. మొత్తంగా.. ఈ పాటకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అనే టాక్. అలాగే జాతర బ్యాక్ డ్రాప్‌లో వచ్చే యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ చివరి నాటికి పూర్తి కానుందని సమాచారం. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి సెప్టెంబర్ 27న రానున్న దేవర ఆయుధ పూజ, డిసెంబర్ 6న రానున్న పుష్ప2 లోని జాతర సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Show comments