జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా రూపొందింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ అయిన నేపథ్యంలో సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కథలో భాగంగా సెకండ్ పార్ట్‌లో ఏమవుతుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమా ఆగిపోయిందని, ఈ సినిమా స్థానంలోనే జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా అలాగే త్రివిక్రమ్ సినిమాలు మొదలుపెట్టబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే అదంతా ఒట్టి ప్రచారమే అని తెలుస్తోంది.
Also Read: IND vs PAK: ఆసియా కప్‌లో భారత్–పాక్ మ్యాచ్ జరిగేది డౌటే?.. సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు
దేవర 2 కథ ఇప్పటికే లాక్ అయిందని అంటున్నారు. ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కాగానే దేవర 2 పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిలిచిపోయిందని మాట అవాస్తవం అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో పాటు కొరటాల శివ స్నేహితుడికి చెందిన యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ మీద సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా నిలిచిపోయిందనే ప్రచారం ఎందుకు తెరమీదకు వచ్చిందో కూడా తెలియదని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ లైన్ అప్ అయితే ప్రస్తుతానికి ఆసక్తికరంగా కనబడుతోంది. దేవర 2 పూర్తయ్యాక ఆయన త్రివిక్రమ్ సినిమాతో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలు చేయబోతున్నాడు.