ఇటీవల నాని “హిట్ త్రీ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. మే ఒకటో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం బీసీ సెంటర్లను టార్గెట్‌గా చేసుకొని చేసిన ఈ సినిమా బాగానే వర్కౌట్ అయినట్లుగా చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌లో ఒక చిన్న డైలాగ్ అందరినీ ఆకర్షించింది. అదేంటంటే, ఒక యువతి నానిని “నువ్వు ఇక్కడ సర్వైవ్ ఇవ్వలేవు” అంటే, ఆమెను చంపేసి “కెరీర్ మొదటి నుంచి నన్ను సర్వైవ్ అవ్వలేదు అని అంటున్నారు” అంటూ కామెంట్ చేస్తాడు.
Read More:Samantha- Sree Vishnu: సమంత ‘శుభం’ని డామినేట్ చేస్తున్న ‘#సింగిల్’ శ్రీవిష్ణు
తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో ఇదే విషయాన్ని నాని సోదరి దీప్తి ఘంట ప్రస్తావించింది. నిజానికి నాని సోదరి దీప్తి గతంలో అమెరికాలో సెటిలైంది. నాని నిర్మాణ సంస్థ మొదలుపెట్టిన తర్వాత ఆమెను తీసుకొచ్చి ఆ నిర్మాణ సంస్థ బాధ్యతలు ఆమెకు అప్పగించారు. ఇక “హిట్ త్రీ” సినిమా స్టేజి మీద ఆమె మాట్లాడుతూ, “ఈ సినిమా విషయంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు. కోర్టు సినిమాలో బిజీగా ఉండడంతో ఈ సినిమా అంతా వేరే వ్యక్తి చూసుకున్నాడు” అని చెప్పుకొచ్చింది.
Read More:Nani: పాకిస్తాన్ వాళ్లకు ఆ కిక్ ఉండకూడదనే.. సక్సెస్ మీట్ పెట్టా
అంతేకాక, ఈ సినిమా ట్రైలర్‌లో మీరు చూసిన “సర్వైవ్ అవ్వలేరు” అనే డైలాగ్ ముందు నుంచి నేనే అంటూ వచ్చాను. “నేను, నా తల్లిదండ్రులు నానికి సినిమాలకు దూరంగా ఉండమని చెప్పే వాళ్ళం. ఈ సినిమాలలో నువ్వు సర్వైవ్ అవ్వలేవు అంటూ మేము చెప్పుకొచ్చే వాళ్ళం. కానీ ఈ రోజు అతను ఇక్కడ సర్వైవ్ అవడం అనేది చాలా చిన్న పదం అయిపోయింది. తన లాగా కష్టపడాలి అనుకునే వారికి అతను ఒక రోల్ మోడల్‌గా తయారయ్యాడు. నేను నానిని చూసి చాలా గర్వపడుతున్నాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. నాని “వాల్‌పోస్టర్” సినిమా కోసం ఆమె త్వరలోనే దర్శకురాలుగా కూడా మారబోతున్నారు.
