NTV Telugu Site icon

Deepika Padukone: దీపికా కూడా నెపోటిజం బాధితురాలేనా!.. హాట్‌టాపిక్‌గా హీరోయిన్‌ కామెంట్స్‌

Deepika Padukone1

Deepika Padukone1

Deepika on Nepotism: నెపోటిజం.. బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపించే పేరు ఇది. పాత అంశమే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా చర్చ, రచ్చ జరుగుతూనే ఉంటుంది. అక్కడ స్టార్‌ కిడ్స్‌కి మాత్రమే ఆఫర్స్‌ ఉంటాయని, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని నటులకు, కొత్తవారికి ఆఫర్స్‌ ఉండవనే వాదన ఉంది. ఈ అంశంపై ఫైర్‌ బ్రాండ్ కంగనా రనౌత్‌ తరచూ రచ్చ చేస్తూ ఉంటుంది. యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌ నెపోటిజంపై తీవ్ర చర్చ జరిగింది. దాని వల్లే సుశాంత్‌ మరణించాడంటూ చాలా మంది ఆరోపించారు. ఇక అప్పటి నుంచి బి-టౌన్‌ సాధారణ నటులు నెపోటిజంపై తరచూ ప్రస్తావిస్తూ సంచలన కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె కూడా నెపోటిజంపై వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

Also Read: Unstoppable with NBK : బాలకృష్ణ డైలాగ్ చెప్పిన రణ్ బీర్ కపూర్..

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో దీపికాది ఫస్ట్‌ ప్లేస్‌ అనడంలో సందేహం లేదు. పాన్‌ ఇండియా, భారీ ప్రాజెక్ట్స్‌ చేస్తూ అగ్రనటిగా కొనసాగుతోంది. నిజానికి దీపికా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. బెంగళూరుకు చెందిన ఆమె సినీ కెరీర్‌ను కన్నడలో స్టార్ట్‌ చేసింది. ఆ తర్వాత ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేని తను బాలీవుడ్‌లో స్టార్‌ పోజిషన్‌కి రావడం అంటే సాధారణ విషయం కాదనే చెప్పాలి. అందరిలానే దీపికా కూడా మొదట్లో చాలా కష్టపడిందట. తను ఈ స్థాయికి అంత ఈజీగా రాలేదని, ఎన్నో చేదు అనుభవాలు దాటుకుని వచ్చానంది.

Also Read: Mahesh Babu: కృష్ణ వర్థంతి.. తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన మహేష్

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఇరవై ఏళ్ళ క్రితం నాకు సినిమాలు తప్ప ఇంకో మార్గం లేదనుకొని వచ్చాను. అప్పట్లో అవకాశాలు రావడం చాలా కష్టం. నా పేరెంట్స్ సినీ పరిశ్రమకు చెందిన వారు కాదు. నాకు ఇక్కడ ఎలాంటి గాడ్ ఫాదర్లు లేరు. అసలు బాలీవుడ్ అంటేనే వారసులు ఎక్కువ.. ఇక్కడ స్టార్‌ కిడ్స్‌కే ఛాన్సులు దక్కేవి. దీన్నే ఇప్పుడు నెపోటిజం అంటున్నారు. అది అప్పుడూ ఉంది.. ఇప్పుడు కూడా ఉంది. ఎప్పటికి ఉంటుంది. ఈ నెపోటిజం అందరూ అంగీకరించాల్సిందే’ అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో నెపోటిజం పదమే కాంట్రవర్సీ.. అలాంటిది తాజాగా దీపికానే ఇలాంటి కామెంట్స్‌ చేయడంతో మరోసారి నెపోటిజం పదం తెరపైకి వచ్చింది.