Site icon NTV Telugu

డ్రగ్ కేసు : దీపికా మేనేజర్ కు బెయిల్ నిరాకరణ

Deepika Padukone, Drug case, Deepika Padukone Ex Manager Karishma Prakash, Karishma Prakash, Bollywood,

డ్రగ్స్ సంబంధిత కేసులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మాజీ మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె అప్లై చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ని ఆగస్టు 5న ప్రత్యేక నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌డిపిఎస్) చట్టం కోర్టు తిరస్కరించింది. అయితే ఇంతకుముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు 2021 ఆగస్టు 25 వరకు బొంబాయి హైకోర్టును ఆశ్రయించడానికి కోర్టు అనుమతించింది. తాజాగా డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ద్వారా వాదనలు విన్న తరువాత ప్రత్యేక న్యాయమూర్తి వివి విద్వాన్స్ కరిష్మా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు. కరిష్మా ప్రకాష్ బాంబే హైకోర్టును ఆశ్రయించడంపై స్టే విధిస్తూ కోర్టు ఆగస్టు 25 వరకు ఆ ఉత్తర్వును నిలిపి వేసినట్లు తెలుస్తోంది.

Read Also : సిద్ధార్థ్, కియారా లవ్ ఎఫైర్!?

దిగువ న్యాయస్థానం ఆదేశానికి వ్యతిరేకంగా కరిష్మా ప్రకాష్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి ఆమె న్యాయవాది అబాద్ పోండా కోర్టును అనుమతి కోరారు. అప్పటి వరకు వారానికి ఒకసారి ఆమె ఎన్‌సిబి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. గతేడాది అక్టోబర్ నెలలో కరిష్మా ప్రకాష్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ కోర్టులో ముందస్తు బెయిల్ దరఖాస్తును దాఖలు చేశారు. డ్రగ్స్ కేసు విచారణలో అరెస్ట్ భయంతో కరిష్మా ఈ పిటిషన్ వేశారు. సుశాంత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి, సారా అలీ ఖాన్, అర్జున్ రాంపాల్, అనేక మందిని విచారణ కోసం పిలిచిన విషయం తెలిసిందే.

Exit mobile version