NTV Telugu Site icon

Dear Nanna: మరో ఓటీటీలో చైతన్య రావ్ ‘డియర్ నాన్న’

Dear Nanna In Etv Win

Dear Nanna In Etv Win

Dear Nanna Streaming in Etv Win: యంగ్ టాలెంటెడ్ హీరో చైతన్య రావ్, యష్ణ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి అంజి సలాది దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి రాకేష్ మహంకాళి కథ అందించడంతో పాటు స్వయంగా నిర్మించగా ముందుగా ఆహాలో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా మరో ఓటీటీలోకి కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా ఆగస్ట్ 1 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతుంది. కరోనా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సత్తా చాటింది.

Bunny Vasu: ఏ బ్లేడు ఎప్పుడు కోస్తుందో తెలీదు.. మెగా-అల్లు వివాదంపై బన్నీ వాసు కీలక వ్యాఖలు

హ్యూస్టన్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 రెమి అవార్డు విజేతగా నిలిచింది డియర్ నాన్న. చెఫ్ కావాలని కలులు కనే చైతన్య రావ్ తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తనలో కలిగిన మార్పుని దర్శకుడు అంజి సలాది ఆలోచన రేకెత్తించే విధంగా ఎఫెక్టివ్ గా ఇందులో చూపించారు. కరోనా సమయంలో మెడికల్ షాప్ ల ప్రాధాన్యత, వారు చేసిన త్యాగాలని ఈ సినిమాలో చూపించారు. ఫాదర్ ఎమోషన్ సన్ ఎమోషన్ లో ఇందులో మరో హైలెట్ అని చెప్పొచ్చు. చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులని అలరించేలా ఉన్నాయి. అనిత్ కుమార్ మాధాడి డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గిఫ్టన్ ఎలియాస్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రవణ్ కటికనేని ఎడిటర్.

Show comments