NTV Telugu Site icon

Nani: నాని ‘హిట్ 3’ టీజర్‌కి డేట్ లాక్..!

February 7 2025 02 19t140531.536

February 7 2025 02 19t140531.536

టాలీవుడ్‌లో హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రజంట్ ఆయన ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శేలేష కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్‌’ చిత్రం మొదటి భాగంగా విశ్వక్‌సేన్‌ అదరగొట్టాడు అని చెప్పాలి. కోపం, బాధ కలగలిపిన భావాలను భలేగా పండించాడు. ఆ తర్వాత రెండో ‘హిట్‌’లో సెటిల్డ్‌ యాక్షన్‌తో అడివి శేష్‌ వావ్‌ అనిపించాడు. దీంతో మూడో ‘హిట్‌’ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఉన్నారు. మొత్తానికి ‘హిట్ 3’ లో నాని లాక్ అయాడు. అయితే తాజాగా ఈ మూవీ నుండి అప్ డెట్ ను వదిలారు మూవీ టీం.

Also Read:Radhika Apte: బాత్రూమ్ లో ఆ పని చేస్తూ దొరికిపోయిన రాధికా ఆప్టే.. ఒక చేతిలో మందు ఇంకో చేతిలో..

ఇక మంచి అంచనాల నడుమ వస్తున్న ఈ ‘హిట్ 3’ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా దీనిపై ఇప్పుడు అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది. ఈ ఫిబ్రవరి 24న ఈ మూవీ టీజర్ రాబోతున్నట్టు యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేసేసారు. చిన్న వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలిపారు మూవీ టీం. ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నిర్మాణంలో నాని కూడా భాగం కాగా, దర్శకుడు శైలేష్‌ కొలను ‘హిట్‌ 3’ సినిమా కోసం భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ‘హిట్‌ 4’ కోసం రవితేజ దాదాపు ఓకే అయ్యారని, ఆయన ఈ మూడో ‘హిట్‌’ క్లైమాక్స్‌లో కనిపిస్తారని టాక్‌ కూడా బయటకు వచ్చింది. మొత్తానికి గట్టి ప్లాన్ తో వస్తున్నాడు శేలేష.