Senior Star Heros : దసరా నెలలో ముగ్గురు సీనియర్ స్టార్స్ సినిమాలు

Chiranjeevi Rajinikanth

Chiranjeevi Rajinikanth

దసరా రేస్ లో ఇద్దరు స్టార్స్ మిడిల్ డ్రాప్ కావడంతో, ఇద్దరు సీనియర్ స్టార్స్ కన్ను దసరాపై పడింది. ఒకరు మెగాస్టార్, మరొకరు సూపర్ స్టార్. ఈ ఇద్దరి సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ సూపర్ స్టార్ ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ‘జైలర్ 2’ వచ్చిన మరుసటి రోజే చిరంజీవి ‘విశ్వంభర’తో వస్తున్నాడా? వాచ్ ది స్టోరీ. చాలా కాలంగా ఊరిస్తున్న ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది. దీపావళికి వస్తుందనుకుంటే ముందుగానే దసరాకు అక్టోబర్ 15న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. హృతిక్ రోషన్ పై రీసెంట్ గా 25 రోజుల పాటు తీసిన సీన్స్ తో సినిమా షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ లోనే షూటింగ్ పూర్తయిందంటూ చిత్ర యూనిట్ ఫోటో దిగింది. అయితే ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేయడం కోసం 25 రోజుల పాటు మళ్ళీ షూట్ చేశాడు దర్శకుడు నెల్సన్. రీసెంట్ గా గుమ్మడికాయ కొట్టడంతో రిలీజ్ డేట్ ప్రకటించారు.

2025 సంక్రాంతికి రావాల్సిన ‘విశ్వంభర’ నెలలు లేట్ గా దసరాకు వస్తుందట. విఎఫ్ఎక్స్ (VFX) వర్క్స్ పై విమర్శలు రావడంతో బెటర్మెంట్ విజువల్స్ కోసం రిలీజ్ ఆలస్యమైంది. సిజి (CG) పనులు ఓ కొలిక్కి రావడంతో అక్టోబర్ 16న రిలీజ్ చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసింది. ఒకరోజు గ్యాప్ లో చిరంజీవి, రజినీకాంత్ వచ్చినా నో ప్రాబ్లం. చిరంజీవి, బాలకృష్ణ చాలాసార్లు ఒకేసారి బరిలో దిగిన సందర్భాలు ఉన్నాయి. ఎలాగో రికార్డ్ స్థాయిలో థియేటర్స్ రాబట్టుకునే సత్తా మెగాస్టార్ కి ఉంది. దసరాకు రిలీజ్ అంటూ ముందుగా అనౌన్స్ చేసిన హీరో నాగార్జున. చాలా కాలంగా వందవ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఈ మూవీని దసరాకు, ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూడో పార్ట్ ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇందులో ఒక్కటి అనుకున్న టైంకి రావడం కష్టమే. దసరా రేస్ నుంచి నాగార్జున 100వ సినిమాతో పాటు ప్రభాస్ ‘ఫాజీ’ కూడా తప్పుకుంది. షూటింగ్ పూర్తి కాకపోవడంతో దసరాకు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఇలా నాగ్, ప్రభాస్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ ను ‘విశ్వంభర’, ‘జైలర్ 2’ భర్తీ చేస్తున్నాయి. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా సెలవుల్లో వస్తే నాలుగు కలెక్షన్స్ వెనకేసుకుంటాయి. డిజాస్టర్ మూవీకి నష్టాలు కాస్త తగ్గుతాయి. ‘పెద్ది’ విషయంలో ఇదే జరిగింది, ఈ పాఠంతో దసరా పండగనే టార్గెట్ చేశారు. ఇక వెంకటేష్ ఏ గొడవ లేకుండా అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’తో వస్తున్నాడు. దసరాకు ముందే కలెక్షన్స్ లాగేసి పండగ వసూళ్లు బోనస్ అవుతాయన్న ప్లాన్ వెంకీది.