NTV Telugu Site icon

Darshi : విజయ్ దేవరకొండ చేతిలో ఆ హీరో జాతకం

Darshi

Darshi

విభిన్న చిత్రాలదర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. హాస్యనటుడు ప్రియదర్శి, తెలుగమ్మాయి రూప కొడువాయూర్ హీరో, హీరోయిన్స్ గా నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో గతంలో ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ హిట్స్ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది.

Also Read : Rapo22 : మెుత్తానికి రామ్ రూటు మార్చి మరో సినిమా స్టార్ట్ చేసాడు

తాజాగా ప్రేక్షకులకు సారంగపాణి జాతకం ఎలా ఉండబోతుందో టీజర్ ద్వారా కాస్త పరిచయం చేయనున్నారు. అందుకు ముహుర్తాన్ని ఫిక్స్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 21వ తేదీన ఉదయం 11:12 గంటలకు రిలీజ్ చేయనున్నాడు. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టిన మేకర్స్, ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మనిషి భవిష్యత్తు తన చేతి రేఖల్లో ఉంటుందా.. లేదా మనిషి చేసే చేతల్లో ఉంటుందా.. అనే కథాంశంతో వస్తున్న ఈ సినిమా కంప్లిట్ కామెడీ  ఎంటర్టైనర్ గా రానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20వ తేదీన క్రిస్టమస్ కానుకగా వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు మేకర్స్.

Show comments