తమిళ స్టార్ ధనుష్ ప్రజంట్ ఒక సినిమా పూర్తి చేస్తూనే మరో సినిమాలు కమిట్ అవుతూ ఆ షుటింగ్స్ కూడా కంప్లీట్ చేప్తున్నాడు. ఇందులో భాగంగా ధనుష్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘కుబేర’ ఒకటి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, వంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రల్లో కనిపించనుండగా.. నాగార్జున బిజినెస్ టైకున్ పాత్రలో మెరవబోతున్నాడు. మనకు తెలిసి శేఖర్ కమ్ముల సినిమా అంటే తప్పకుండా ప్రేక్షకులను మెప్పించేలానే ఉంటుంది. అందులోనూ ధనుశ్‌తో శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ ‘కుబేర’ మీద భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: Simran : అలాంటి పాత్రలకంటే .. ఆంటీలా నటించడం ఉత్తమం
ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్‌రావుతో కలిసి, సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే మూవీ నుంచి వరుస అప్‌డేట్‌లను వదలగా తాజాగా ఫస్ట్ సింగిల్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘పోయి రా మావా’ అంటూ సాగే పాటను విడుదల చేయగా. ఇందులో ధనుష్ మాస్ డ్యాన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. భాస్కర్ భట్ల లిరిక్స్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను ధనుష్ పాడటం విశేషం. ప్రస్తుతం వైరలవుతున్న ఈ పాటను మీరు కూడా చూసేయండి.
