NTV Telugu Site icon

Dance IKON2 : ఆహా OTT డాన్స్ ఐకాన్ – 2 వచ్చేస్తోంది.. ఈ సారి హోస్ట్ ఎవరంటే..?

Aha

Aha

ప్రపంచవ్యాప్తంగా డ్యాన్సర్లందరికి ఆహ్వానం పలుకుతోంది ప్రముఖ ప్రాంతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా OTT.  డ్యాన్స్ IKON2 అంతర్జాతీయ ఆడిషన్స్ ను స్టార్ట్ చేస్తోంది ఆహా. డ్యాన్స్ స్టైల్‌పై ఎటువంటి పరిమితులు లేకుండా 6 నుండి 30 సంవత్సరాల వయస్సు గల డాన్సర్స్ కు ఆడిషన్ నిర్వహిస్తుంది. మీరు సోలో పెర్ఫార్మర్ అయినా, జోడిలో భాగమైనా లేదా గ్రూప్ (ఐదుగురు వరకు) సభ్యుడైనా, ఆహా డ్యాన్స్ IKON2 ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాన్సర్స్ ను ఆహ్వానిస్తోంది. కానీ డ్యాన్స్ వీడియో గరిష్టంగా 90 సెకన్లు మరియు గరిష్టంగా 50 MB పరిమాణంలో ఉండాలి. నవంబర్ 10 నుండి నవంబర్ 16, 2024 వరకు డ్యాన్సర్స్ ఆడిషన్ వీడియోస్ క్రింది లింక్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు: http://aha.video/dance-ikon-auditions.

Also Read : Balayya : ‘NBK109’ మూవీ టైటిల్ టీజర్ డేట్ ఇదే

ఆహా OTT CEO రవికాంత్ సబ్నవిస్ మాట్లాడుతూ, “ఆహా OTT వద్ద, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతులైన  డాన్సర్స్ తమ టాలెంట్ ను ప్రపంచ వేదికపై ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. డాన్స్ IKON2తో కొత్త టాలెంట్ ను బయటకు తీస్తాం. ఈ సంవత్సరం థీమ్, ‘డ్యాన్స్ ఫర్ ఎ కాజ్’ పాల్గొనేవారికి ఒకటే చెప్తాం మీలో ప్రతిభ ఉంటె దాన్ని నిరూపించుకోవడానికి డ్యాన్స్ IKON2 అద్భుత అవకాశం’ అని అన్నారు.  హిప్-హాప్, క్లాసికల్ మరియు మరిన్నింటితో సహా అన్ని రకాల డాన్స్ లో అనుభవం ఉన్న లేదా జూనియర్ అయినా సరే, ఆహా డ్యాన్స్ IKON2 అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కళాకారులతో పరిచయం పొందడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి సరైన వేదిక. ఇంకెందుకు ఆలస్యం మీరు మంచి డ్యాన్సర్ అయితే ఆహా డ్యాన్స్ ఐకాన్ 2 కి అప్లై చేసేయండి.  మొదటి సీజన్ ను హోస్ట్ చేసిన ఓంకార్ ఇప్పుడు రాబోతున్న సీజన్ 2 ను హోస్ట్ చేయబోతున్నాడు.

Show comments