NTV Telugu Site icon

Dadasaheb Phalke : మిథున్ చక్రవర్తికి బాలయ్య స్పెషల్ విషెష్

Mithun Balayya

Mithun Balayya

దేశంలోనే సినీ రంగానికి సంబంధించి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అత్యంత కీలకమైనది. ఈ ఏడాది ఈ అవార్డుకు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఎంపిక‌య్యారు. ఈ విష‌యాన్ని కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ తాజాగా అధికారికంగా ప్ర‌క‌టిం చింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఈ పుర‌స్కారాన్ని అందుకోనున్నారు.

Also Read : Devara : నార్త్ అమెరికా – నైజాం ‘దేవర’ కలెక్షన్స్ ఫుల్ డీటెయిల్స్

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన మిత్రుడు మిథున్ చక్రవర్తికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాలయ్య మాట్లాడుతూ ” విలక్షణ నటుడు, మిత్రుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయం. తొలి చిత్రం ‘మృగయా’తోనే నటునిగా తనదైన బాణీ పలికించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు మిథున్ చక్రవర్తి. ఆరంభంలో వాస్తవ చిత్రాలతో సాగినా, తరువాత బాలీవుడ్ కమర్షియల్ మూవీస్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు మిథున్. ముఖ్యంగా ‘డిస్కో డాన్స్’కు మిథున్ చక్రవర్తి విశేషమైన పేరు సంపాదించి పెట్టారు. మిథున్ చక్రవర్తితో నాకు చిత్రబంధం ఉంది- అదెలాగంటే నేను సోలో హీరోగా బయటి సంస్థల చిత్రాలలో నటించడానికి తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం ‘డిస్కో కింగ్’. ఈ చిత్రానికి మిథున్ చక్రవర్తి హిందీ సినిమా ‘డిస్కో డాన్సర్’ ఆధారం. అలా మా ఇద్దరికీ చిత్రబంధం ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికై మిథున్ చక్రవర్తికి నా హృదయపూర్వక శుభాభినందనలు. మిథున్ నటునిగా మరెన్నో విలక్షణమైన పాత్రలలో మురిపిస్తూ సాగాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.

Show comments