Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dada: నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ధమాకా ‘దాదా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంటోంది. ఇటీవల మైసూర్లో భారీ ఎత్తున ప్రారంభమైన కీలక యాక్షన్ షెడ్యూల్ దాదాపు పూర్తి కావొచ్చిందట. తాజాగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. మైసూర్ షెడ్యూల్ ప్యాకప్ అవ్వగానే టీమ్ నేరుగా హైదరాబాద్ చేరుకోనుందని తెలుస్తుంది. నగరంలో మరో ఐదారు రోజుల పాటు జరిగే లాస్ట్ షెడ్యూల్‌తో ఈ చిత్రానికి సంబంధించిన టోటల్ టాకీ పార్ట్ పూర్తయిపోనుందని సమాచారం. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో కాకినాడ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో బాలకృష్ణ గాయం కావడంతో షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఆ గాయం నుంచి బాలయ్య పూర్తి స్థాయిలో కోలుకుని, రెట్టింపు ఉత్సాహంతో అక్టోబర్ మొదటి వారంలోనే మైసూర్ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. అక్కడ ఏమాత్రం రాజీ పడకుండా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేసి రికార్డు సమయంలో షూటింగ్ పార్ట్‌ని కొలిక్కి తెచ్చారని చెబుతున్నారు. ఇక హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన ఆఖరి షెడ్యూల్ పూర్తయితే షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టించనున్నారని సమాచారం. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి, అంటే క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి దించేందుకు చిత్ర బృందం పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలయ్య-గోపీచంద్ మలినేని-తమన్ ఎస్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ నెవర్ బిఫోర్ అనేలా అత్యంత పవర్ఫుల్ విలన్ రోల్లో కనిపించబోతున్నారు. వీరితో పాటు బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Also Read
తాజావార్తలు
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..