NTV Telugu Site icon

Dacoit : అఫీషియల్.. డెకాయిట్ లో హీరోయిన్ గా సక్సెస్ బ్యూటీ

Decoit

Decoit

అడివి శేష్ హీరోగా శృతి హాసన్ జంటగా డెకాయిట్ అనే సినిమాను ప్రకటించి చాలా కాలం కావొస్తుంది. అప్పట్లో ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసారు. కానీ ఎందుకనో గత కొన్ని నెలలుగా ఈ సినిమానుండి ఎటువంటి అప్డేట్ లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ నిర్మాతగా ఈ సినిమా రానుంది.

Also Read : Manchu Family : సంచలన లేఖ విడుదల చేసిన మంచు నిర్మల

అయితే ఈ సినిమా నుండి శ్రుతి హాసన్‌ వైదొలిగినట్టు వార్తలు వచ్చాయి కానీ అధికారకంగా ప్రకటించలేదు. ఆమెను తొలగించి మృణాల్ ను తీసుకున్నారు అని వార్తలు వినవచ్చాయి. కాగా నేడు ఈ సినిమా నుండి చిత్ర హీరో అడివి శేష్ బర్త్ డే కానుకగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఆ పోస్టర్ లో అడివి శేష్ తో పాటు మృణాల్ ఠాకూర్ ల ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేస్తూ అధికారకంగా రిలీజ్ చేసారు. గన్ పట్టుకుని కార్ లో డ్రైవింగ్ చేస్తూ సీరియస్ లుక్ లో ఉన్న మృణాల్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుందనే చెప్పాలి. ఇప్పటి వరకు చాలా సాఫ్ట్ రోల్స్ లో కనిపించిన మృణాల్ ఈ సినిమాలో తొలిసారి రఫ్ లుక్ లో దర్శనం ఇస్తుంది. టాలీవుడ్ లో వరుస హిట్స్అందుకున్న మృణాల్ తొలిసారి జోడికడుతున్న అడివి శేష్ సినిమాతో ఎంత పెద్ద హిట్ అందిస్తుందో చూడాలి.

Show comments