Site icon NTV Telugu

Ar Rahman : మళ్లీ ఇరకాటంలో పడ్డ ఏఆర్ రెహ‌మాన్‌..

Ar Rehman

Ar Rehman

మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ‌మాన్ .. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఆయన గ‌త 30 సంవ‌త్సరాలుగా అనేక అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ అవార్డ్ కూడా సాధించిన ఘ‌న‌త ఆయ‌న‌ది. రెహమాన్ రూపొందిన ప్రతి పాట ఇప్పటికీ ట్రైండింగ్ లోనే ఉంటాయి. అయితే ప్రజంట్ వరుస ప్రాజెక్ట్‌ల విషయం పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల‌లో నిలుస్తున్నాడు రెహమాన్ . భార్యతో విడాకులు, అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిక ఇలా ప‌లు విష‌యాల‌తో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇక తాజాగా మరో ఇబ్బందుల్లో ప‌డ్డాడు.

Also Read: Tom Cruise : ‘మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..

కాపీరైట్ ఉల్లంఘన వివాదంలో రెహ‌మాన్ చిక్కుకోవ‌డం సంచలనంగా మారింది. 2022 లో మణిరత్నం దర్శకత్వంలో విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించ‌గా, 2023లో పొన్నియిన్ సెల్వన్ రెండవ భాగం విడుదలైంది. కాగా ఈ మూవీలో ‘వీర రాజ వీర’ అనే పాట మంచి ఆదరణ పొందింది. అయితే ఈ పాట కాపీరైట్‌కు సంబంధించి కోర్టులో దాఖలైన కేసులో ఏఆర్ రెహమాన్ రూ. 2 కోట్లు చెల్లించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. గాయకుడు వాసిఫుద్దీన్ ఠాగూర్ తన తాత, తండ్రి రచించిన శివ స్తుతి సంగీతాన్ని, కాపీ కొట్టారని కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేయ‌గా.. ఈ కేసులో శుక్రవారం మధ్యంతర తీర్పు వెల్లడించింది. సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రూ.2 కోట్లును, చిత్రంలో క్రెడిట్ ను పిటిషన్‌దారులకి అందించాలని ఆదేశించింది.

Exit mobile version