NTV Telugu Site icon

Kollywood : ఐశ్వర్య – ధనుష్ లకు విడాకులు మంజూరు చేసిన కోర్టు

Dhanush

Dhanush

తమిళ స్టార్ హీరో ధనుష్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడిపోతున్నాం అని కొన్ని నెలల క్రితం ప్రకటించారు. కానీ ఇటీవల ఈ జంట మరల ఒకటవ్వబోతున్నట్టు వార్తలు హల్ చల్ చేసాయి. అవేవి వస్తావం కాదని విడాకులు కావాలని కోర్టు ను ఆశ్రయించారు. ఐశ్వర్య, ధనుష్  నవంబర్ 21 న చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు, అక్కడ వారు విడిపోవాలనే కోరుకుంటున్నట్టు న్యాయస్థానం ముందు వ్యక్తం చేశారు. విడాకుల కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి విచారణను నవంబర్ 27కి వాయిదా వేశారు. నేడు వీరి కేసులో తుది తీర్పు వెల్లడిస్తూ   వీరికి విడాకులు మంజూరు చేసింది కోర్టు. ధనుష్, ఐశ్వర్య 2004లో చెన్నైలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.

Also Read : Kollywood : తమిళ ఇండస్ట్రీని ఆదుకున్న చిన్న హీరోలు

18  సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా జీవించిన ఈ జంట 2022లో  విడిపోవాలనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.  ఆ లేఖలో “స్నేహితులుగా, జంటగా, పేరెంట్స్ గా, శ్రేయోభిలాషులుగా   18 ఏళ్లు కలిసి ఉన్నాం. ఇన్నాళ్లు  ఒకరినొకరం అర్థం చేసుకుంటూ, సర్దుకుంటూ  ప్రయాణం సాగించాం. కానీ ఈరోజు మా దారులు వేరవుతున్నాయి మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం” అని ధనుష్ ట్వీట్ చేశాడు. అదే మెసేజ్ ను అటు ఐశ్వర్య కూడా షేర్ చేసింది. ఈ దంపతులకు  లింగా, యాత్ర అనే  ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య పిల్లలతో కలిసి తన తండ్రి రజనీకాంత్ ఇంట్లో ఉంటుంది. ధనుష్ సెపరేట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నివాసం ఉంటున్న పోయెస్ గార్డెన్ కు సమీపంలో ధనుష్ నూతనంగా ఓ ఇళ్లు కొనుగోలు చేసాడు.