Site icon NTV Telugu

Coolie : యూఎస్ లో ‘కూలీ’ సెన్సేషన్..

Coolie

Coolie

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా లెవెల్ లో అత్యధికంగా ఎదురుచూసే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సమానంగా బాక్సాఫీస్ అంచనాలు కూడా ఏ రేంజ్‌లో ఉన్నాయో.. యూఎస్ బుకింగ్స్‌తోనే స్పష్టమవుతోంది. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో ‘కూలీ’ ప్రీమియర్ బుకింగ్స్‌ ఇటీవలే ప్రారంభమైనప్పటికీ, ఈ సినిమాకి వచ్చిన స్పందన అంతాఅంతకాదు. విడుదలకు ఇంకా సగం నెలకి పైగా టైమ్ ఉన్నా, ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్‌ని దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది రజినీ క్రేజ్, లోకేష్ బ్రాండ్, అనిరుద్ మ్యూజిక్ పట్ల ఉన్న అంచనాలకు నిదర్శనం.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మాస్, యాక్షన్, ఎమోషన్‌తో కూడిన భారీ కథనాన్ని ముందుకు తీసుకువెళ్తున్న దర్శకుడు లోకేష్, ఈ చిత్రానికి అనిరుద్‌ సౌండ్‌ట్రాక్‌తో మరింత ఊపు తేనున్నాడు. అన్ని భాషల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక రజినీకాంత్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాపై భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. టీజర్, పోస్టర్లు, రజినీ లుక్, డైలాగ్ క్లిప్స్ అన్నీ వైరల్ అవుతుండటంతో, ఫ్యాన్స్ ఫీవర్ రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఈ స్థాయి స్పందన రావడం మిగతా మార్కెట్‌లోనూ భారీ ఓపెనింగ్స్‌కి దారితీయనుంది. ‘జైలర్’ సక్సెస్ తర్వాత రజినీకాంత్ నుండి వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి రజినీ మేజిక్ కనబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version