ఈ ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలన్నింటిలో కూలీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ వరుస సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న లోకేష్ కనగరాజు దర్శకుడు కావడంతో పాటు రజనీకాంత్, ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించడం మరో కారణం. నిజానికి ఈ సినిమాకి ఇప్పటివరకు ఆకాశమే హద్దు అన్నట్టుగా అంచనాలు ఉన్నాయి.
Also Read:Pawan Kalyan: పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వమే.. బీజేపీ, టీడీపీ నాయకులకు పవన్ కీలక సూచన..!
కచ్చితంగా ఈ సినిమాతో లోకేష్ మరో హిట్ అందుకుంటాడని దాదాపుగా అందరూ ఫిక్స్ అయిపోయారు. అలాంటి సమయంలో సినిమా రిలీజ్ కి కరెక్ట్ గా 12 రోజుల ముందు, అంటే ఆగస్టు రెండో తేదీన, కొద్దిసేపు క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మాత్రం చాలా సాదాసీదాగా సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేయకుండా సాగింది. సినిమా కథ కొంచెం కొంచెం రివీల్ చేసినట్టుగానే కనిపించింది. రజనీకాంత్ స్నేహితుడిగా సత్యరాజ్ కనిపిస్తున్నాడు.
Also Read:Anand Sai: పవన్’ను ఎవరూ ఏమీ చేయలేరు!
సత్యరాజ్ కోసం ఒక పోర్ట్ లో కూలీగా రజనీకాంత్ జాయిన్ అయినట్లుగా ట్రైలర్ కట్ చేశారు. తర్వాత రజనీకాంత్ “నా బ్యాక్‌గ్రౌండ్ మర్చిపోయారా?” అంటూ భాష ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేస్తూ ఉన్నట్టుగా ఉన్న ట్రాన్సిషన్ అయితే అదిరిపోయింది. మొత్తం మీద ట్రైలర్ కట్ చూస్తే సినిమా మీద అంచనాలు పెంచకుండా కావాలనే కట్ చేసినట్లు అనిపిస్తోంది. అయితే సినిమాలో ఉన్న పాత్రధారులందరినీ పరిచయం చేయడానికి ట్రైలర్ ఎక్కువ సమయం తీసుకున్నారు. అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ట్రైలర్ కి బాగా వ్యాప్తి అయింది. మొత్తం మీద ట్రైలర్ మీద ప్రస్తుతానికి మిశ్రమ స్పందన వస్తోంది. అదిరిపోయింది అని కొంతమంది కామెంట్ చేస్తుంటే, అంచనాలను పెంచకుండా జాగ్రత్తగా కట్ చేసుకున్నారని కొంతమంది అంటున్నారు.
