Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ లభిస్తే అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్ ను తోసిపుచ్చారు పోలీసులు.. రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నోటీసులను ధిక్కరించారు కాబట్టే అరెస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చిందంటున్నారు. ఆర్జీవీ మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ లో ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలలో గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ పోలీసుల సాయంతో ఆర్జీవీని ట్రాక్ చేస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, హైదరాబాద్ లో ప్రత్యేక బృందాలతో సెర్చ్ చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు రాంగోపాల్ వర్మ..
Read Also: Bomb Blast In Night Club: నైట్ క్లబ్‌లో పేలుడు.. దోపిడీ కోసమేనా?
అయితే, ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేసి ఒంగోలుకు తరలించే యత్నంలో పోలీసులు ఉన్నారు.. మరోవైపు.. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టులో వర్మ వేసిన క్వాష్ పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేశారు.. దీంతో తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ కొనసాగనుంది.. అయితే, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ లోని వర్మ ఇంటికి వచ్చాయి. సోమవారం ఉదయం నుంచి అతను కానీ,ఆయన సిబ్బంది కానీ అందుబాటులో లేరు. వర్మ తన ఇంట్లో లేడని తెలుసుకున్న పోలీసులు.. ఆయనకోసం గాలిస్తున్నారు. రెండు ఫోన్లు స్విచ్చాఫ్ చేసేశారు. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రామ్ గోపాల్ వర్మ డెన్ నుంచి ఏపీ పోలీసులు వెనుదిరిగారు. శంషాబాద్,షాద్ నగర్ లోని ఏదో ఒక ఫాంహౌస్‌లో తలదాచుకున్నాడనే సమాచారంతో…పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడి కూడా రాంగోపాల్ వర్మ లేడని తెలుస్తోంది.
Read Also: Deputy CM Pawan Kalyan: ఢిల్లీలో డిప్యూటీ సీఎం బిజీ బిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
మరోవైపు వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని ఆర్జీవీ లీగల్ టీమ్ తెలిపింది. వ్యక్తిగతంగా హాజరుకాలేనని.. బీఎన్‌ఎస్‌ఎస్ చట్టం ప్రకారం వర్చువల్‌గా హాజరయ్యేందుకు అవకాశం ఉందని తెలిపింది. పోలీసులు ఆర్జీవీని అరెస్టు చేస్తే.. చట్ట ప్రకారం ఎదుర్కొంటామని లీగల్ టీమ్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌లలో రామ్ గోపాల్ వర్మ బిజీగా ఉన్నారని ఆయన తరపు లాయర్ చెబుతున్నారు. ఇది అరెస్ట్ చేసేంత కేసేమీ కాదంటున్నారు. పోలీసులు నోటీసు ఇచ్చారు కానీ ఎన్‌క్లోజర్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా వర్మ కొన్ని పోస్టులు పెట్టారు. దీనిపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా అసభ్యకర పోస్టులపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అలాంటి పోస్టులు చేసిన వారందరిని అరెస్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వర్మపై పోలీసులు ఫోకస్ పెట్టారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో వర్మ అనుచిత పోస్టులు పెట్టినట్లుగా ఒంగోలు పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వర్మకు 41A నోటీసులు ఇచ్చారు. ఈనెల 19న విచారణకి హాజరుకావాల్సి ఉండగా వర్మ వారం రోజులు గడువు కోరారు. దీంతో ఆయన విజ్ఞప్తి మేరకు 25న హాజరు కావాలని ఈ నెల 20నే మరోసారి నోటీసు పంపారు. రాంగోపాల్ వర్మ వాట్సప్ నెంబర్‌కు నోటీసు పంపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎప్పుడైనా హాజరు కావచ్చని తెలిపారు. కానీ వర్మ ఎంక్వైరీకి హాజరు కాలేదు. దీంతో తదుపరి చర్యలకు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.