NTV Telugu Site icon

Nandamuri Balakrishna: ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నా బాలయ్య.. సినీ పరిశ్రమ తరపున సన్మానం

2

2

Nandamuri Balakrishna Completing 50 years in the Film Industry;  నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఎప్పుడూ ముందంజలో ఉంటారు. అదేవిధంగా బసవతారకం హాస్పిటల్ తో బిజీగా ఉండి కూడా ఎంతోమందికి సేవలందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుంటారు. ఇటీవల వరస మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హ్యాట్రిక్ హీరోగా నిలబడ్డారు. అంతేకాకుండా హిందూపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ లీడర్ అనిపించుకున్నారు అదేవిధంగా ప్రజలకు ఎన్నో విధాలుగా ఎంతో సేవ చేస్తున్నారు.

Also Read; Kalki 2898 AD : ప్రభాస్ కల్కి నుంచి రాబోతున్న మరో పవర్ ప్యాక్డ్ ట్రైలర్..?

2024 లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపిన తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షులు శ్రీ కె. ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి శ్రీ టి. ప్రసన్నకుమార్, మరియు ఈసీ మెంబర్ శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు), తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు), కార్యదర్శి శ్రీ కె. ఎల్. దామోదర్ ప్రసాద్ గారు మరియు కోశాధికారి శ్రీ టి. ప్రసన్నకుమార్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి శ్రీ కె. అనుపం రెడ్డి మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి.