Site icon NTV Telugu

Double Ismart: ఏం చేద్దామంటావ్ మరి వివాదం.. పూరీ జగన్నాథ్ పై పోలీసులకు ఫిర్యాదు

Em Cheddam Antav Mari

Em Cheddam Antav Mari

Double Ismart Movie Controversy: డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రిలీజ్ అయిన మార్ ముంత చోడ్ చింత సాంగ్ గురించి ఇప్పుడు పెద్ద వివాదం చెల్లరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు పెట్టింది. ఈ సినిమా యూనిట్ అందులో భాగంగానే మార్ ముంత చోడ్ చింత అనే ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అందులో కేసీఆర్ పలికిన ఏం చేద్దాం అంటావు మరి అనే ఒక డైలాగ్ ని ఈ పాటలో హుక్ లైన్ గా వాడారు. ఈ విషయం మీద ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది.

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లపై భారీగా డిస్కౌంట్..ఎప్పటి నుంచంటే..?

ఇక తాజాగా ఎల్బీనగర్ డీఎస్పీకి పూరీ జగన్నాథ్ మీద చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన డబల్ ఇస్మార్ట్ అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో కేసీఆర్ డైలాగునిగా వాడుకున్నారు. ఇది చాలా అభ్యంతరకరమైన విషయం. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. మా ప్రాంత యాస భాషలను కించపరిచే విధంగా మా బీఆర్ఎస్ నాయకుడిని కించపరిచే విధంగా ఉన్న ఈ పాటను మార్చాలి లేకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని తెలియజేస్తూ ఆ డైలాగును సాంగ్ నుంచి రిమూవ్ చేయాల్సిందిగా కోరుతున్నామంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం మీద ఇప్పటివరకు డబుల్ ఇస్మార్ట్ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.

Exit mobile version