NTV Telugu Site icon

Committee Kurrollu : చిన్న సినిమాలకు ఊపు తెచ్చిన కమిటీ కుర్రోళ్లు సక్సెస్…

Following Venkatesh Daggubati (3)

Following Venkatesh Daggubati (3)

‘డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు.  11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోంది.

Also Read: ThalapathyVijay : కింగ్ ఆఫ్ కలెక్షన్స్.. వరుసగా 8వ సారి విధ్వంసం చేసిన విజయ్

కంటెంట్ ఉన్నోడికి క‌టౌట్ చాల‌నే డైలాగ్ త‌ర‌హాలో మంచి క‌థ‌తో చేసిన సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో నిహారిక అండ్ టీమ్ క‌మిటీ కుర్రోళ్ళు సినిమాతో మరోసారి ప్రూఫ్ చేసారు. ప్రస్తుతం ఈ  సినిమా విజ‌య‌వంతంగా ఐదో వారంలోకి అడుగు పెట్టింది. వినాయక చవితి ఫెస్టివల్, వీకెండ్ కావడంతో కొన్ని ఏరియాస్ లో ఫుల్స్ కనిపించాయి. తక్కువ బడ్జెట్ లో తెరకెక్క్కిన ఈ సినిమా రూ. 20 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఒక చిన్న సినిమా అది అందరు కొత్తవాళ్ళతో వచ్చిన సినిమా ఐదు వారలు థియేటర్లో రన్ అవడం అంటే అభినందించదగ్గ విషయం.

Also Read: Lucky Star : హిట్లు నిల్.. ఆఫర్లు ఫుల్.. రెండు సినిమాలు స్టార్ట్ చేసిన యంగ్ హీరో

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకుందీ చిత్రం. 30 రోజుల థియేటర్ రన్ కాంప్లిట్ చేసుకున్న కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ హ‌క్కుల‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కొనుగోలు చేసి ఈ నెల 12 నుండి స్ట్రీమింగ్ కు తీసుకురాబోతుంది.

 

Show comments