NTV Telugu Site icon

CommitteeKurrollu : కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎక్కడంటే..?

Untitled Design (3)

Untitled Design (3)

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ఆగస్ట్ 9న రిలీజైన 10 సినిమాలలో ఓన్లీ కమిటీ కుర్రోళ్ళు మాత్రమే హిట్ టాక్ తెచుకుంది. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం సోమవారం వర్కింగ్ డే నాడు కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించ‌టం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేశారు.

Also Read: OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమా, సిరీస్ లు ఇవే..

అందరు కొత్త వాళ్ళతో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా  11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ టాలీవుడ్ కు పరిచయమయ్యారు. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌తో ఆడియన్స్ ను కట్టిపడేసాడు ‘కమిటీ కుర్రోళ్ళు’ దర్శకుడు.  చిన్న సినిమా గా రిలీజ్ అయి భారీ విజయం అందుకుంది. ప్రస్తుతం 5 వారంలోకి అడుగుపెట్టింది కమిటీ కుర్రోళ్ళు. ఇదిలా ఉండగా ఒకవైపు థియేటర్లో రన్ అవతున్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్స్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఈవీటి విన్. ఈ సెప్టెంబరు 12న స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ప్రీమియర్ డేట్ ను ప్రకటించింది ఈటీవీ విన్. థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ లో ఏ మాత్రం వ్యూస్ రాబడుతుందో చూడాలి,

Show comments