GV Prakash: క్రేజీ మల్టీస్టారర్ కోసం అనిల్ రావిపూడి బిగ్ స్కెచ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆ కోలీవుడ్ స్టార్!

Anil Ravipudi

Anil Ravipudi

GV Prakash: టాలీవుడ్ హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన 10వ సినిమా ప్రకటనతోనే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. మన శంకరవరప్రసాద్ గారు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను విక్టరీ వెంకటేష్ – నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో ఒక క్రేజీ మల్టీస్టారర్‌గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్టాఫ్ స్క్రిప్ట్ లాక్ అవ్వగా, ప్రస్తుతం సెకండాఫ్ పనులపై అనిల్ అండ్ టీమ్ కసరత్తులు చేస్తున్నారు. అన్ని కుదిరితే జులై లేదా ఆగస్టు నెలల్లో ఈ క్రేజీ మల్టీస్టారర్ పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం.

అనిల్ రావిపూడి తన సినిమాల కథల స్వభావాన్ని బట్టి ఎప్పటికప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్‌ను మారుస్తుంటారు. ఈసారి తన సరికొత్త స్క్రిప్ట్‌కు అద్భుతమైన స్వరాలు అవసరమని భావించి, కోలీవుడ్ స్టార్ కంపోజర్ జి.వి.ప్రకాష్ కుమార్‌ను రంగంలోకి దించారు. ఈ సినిమా కథ, కథనాలు ట్రెండీగా ఉంటూనే, అనిల్ రావిపూడి మార్క్ ఫన్ అండ్ ఎమోషన్స్‌తో సరికొత్త హంగులతో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ మల్టీస్టారర్ చిత్రంలో కాస్టింగ్ మరింత కలర్‌ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా, కల్యాణ్ రామ్ పక్కన కృతి శెట్టి సందడి చేయనుంది. భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి (2027) పండుగ కానుకగా రిలీజ్ చేయడమే లక్ష్యంగా చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.