ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిన విషయమే. ముంబైలోని ఓ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేసాడని, ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. ఈ ఆరోపణలు నేపథ్యంలో జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీని తొలగించారు.
Also Read : Rebal Star : ప్రభాస్ నెక్ట్స్ 5 సినిమాలు.. 5 విభిన్న కథలు..
దిల్లీలో జాతీయ అవార్డు తీసుకునేందుకు రంగారెడ్డి ఫోక్సోకోర్టులో జానీ మాస్టర్ పిటిషన్ దాఖలు చేయగా. ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కు ఇవ్వవలసిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. దీంతో ఆయన బెయిల్ రద్దయింది. తాను కూడా మధ్యంతర బెయిల్ తీసుకోబోనంటూ జానీ మాస్టర్ కూడా కోర్టులో మెమో దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబరు 15 న జానీ మాస్టర్ పై FIR నమోదు చేసారు. సెప్టెంబరు 19 న జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. మొత్తంగా 35 రోజులుగా జైల్ లో ఉన్న జాని మాస్టర్, బెయిల్ మంజూరు కావడంతో చంచల్ గూడా జైలు నుండి విడుదల కానున్నారు.