Site icon NTV Telugu

Chiru Anil: చిరు- అనిల్ సినిమా షూటింగ్ ఆరోజు నుండే!

Chiruanil

Chiruanil

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నామని, తర్వాత మళ్లీ అలాంటి బ్లాక్‌బస్టర్ కొట్టాలని అనిల్ రావిపూడి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేశారు. సెకండ్ హాఫ్‌ను కాస్త బెటర్ చేసే పనిలో ఉన్నారని వార్తలు వచ్చాయి, కానీ అది కూడా పూర్తి అయినట్లు సమాచారం. నిన్న నయనతార కోసం ఆయన చెన్నై బయలుదేరి వెళ్లారు. ఒక అనౌన్స్‌మెంట్ వీడియో షూట్ చేసుకుని వచ్చినట్టు తెలుస్తోంది.

Read More: Samsung Galaxy F56 5G: భారత్ లో అధికారికంగా విడుదలైన గెలాక్సీ F56..!

అయితే, తాజాగా అందుతున్న సమాచరం మేరకు ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వ్యాక్స్ స్టాట్యూ లాంచింగ్ కోసం లండన్ వెళ్లారు. అది పూర్తి అయిన తర్వాత ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారు. తిరిగి వచ్చాక ఒక మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్ తర్వాత షూటింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించనున్నారు.

Exit mobile version