Chiranjeevi’s Megaverse Promo Out: ‘మెగాస్టార్’ చిరంజీవి తొలిసారిగా ఓటీటీ వేదికపై హోస్ట్‌గా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న సెలబ్రిటీ టాక్‌షో ‘మెగావర్స్’లో ఆయన హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఈ టాక్ షోకు సంబంధించిన ప్రోమోను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక నిమిషం నాలుగు సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమో.. ఆటో ఎంట్రీతో ప్రారంభమవుతుంది. చిరంజీవి పేరును ఇంగ్లిష్‌లో రాసే విధానంలో ‘Chiranjeevi’ అనే పదంలోని ‘N’ అక్షరం కనిపించకపోవడాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఆ అక్షరం నెట్‌ఫ్లిక్స్ తరఫున వచ్చి చేరిందనే అర్థం వచ్చేలా సింబాలిక్‌గా వీడియోను రూపొందించారు. ‘అదేంటి.. చిరు పేరులో N లేదు’ అంటూ సాగే పాట ప్రోమోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివర్లో చిరంజీవి పేరులోని ‘N’ అక్షరాన్ని నెట్‌ఫ్లిక్స్ సింబల్‌తో చూపించడం ఆకట్టుకుంటోంది. అనంతరం చిరంజీవి ‘ఇది నా అడ్డా’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో అలరించారు. మెగా నవ్వులు, ముచ్చట్లు ఒకే చోట చూడబోతున్నారని నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రోమో ద్వారా వెల్లడించింది.
చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ టాక్‌షోలో మెగా వినోదం, ఆసక్తికరమైన సంభాషణలు ఉండనున్నట్లు ప్రోమోతో హింట్ ఇచ్చారు. అయితే కార్యక్రమం ప్రారంభ తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ‘మెగావర్స్’ ప్రేక్షకుల ముందుకు రానుందని వీడియోలో పేర్కొన్నారు. తొలి ప్రోమోతోనే ఆసక్తి పెంచిన ఈ షో కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసల్యం ప్రోమోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

