Site icon NTV Telugu

Chiranjeevi : ది బ్లడీ బెంచ్‌మార్క్ ట్యాగ్ తో బాబీ నుండి ‘#Mega158’ అప్డేట్‌..

Chiranjeevi’s #mega158

Chiranjeevi’s #mega158

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో గుడ్ న్యూస్. నేడు ఆయన బర్త్ డే కానుకగా వరుస అప్ డేట్ లు విడుదలవుతుండగా. తాజాగా దర్శకుడు బాబీ కొల్లితో కలిసి చిరంజీవి మరోసారి చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను బాబీ తన జీవితంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాడు. “ఒకే ఒక్క మెగాస్టార్ గారితో రెండోసారి పని చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. #Mega158 అన్ని అంశాల్లో ర్యాంపేజ్‌గా నిలుస్తుంది” అని బాబీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్ బయటకు రావడంతో అభిమానుల్లో ఆనందం మరింత పెరిగిపోయింది. మెగాస్టార్‌ను ఒక కొత్త యాంగిల్‌లో చూపించేందుకు బాబీ భారీ ఎఫర్ట్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. మాస్ ఎలిమెంట్స్, హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ కనెక్ట్‌గా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ చెబుతోంది.

Also Read : Ramayana : వాళ్లకు నచ్చకపోతే రామాయణ మూవీ ఫ్లాప్ అయినట్లే: నిర్మాత

ఈ మాస్ ఎంటర్టైనర్‌కు కె.వీ.ఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా. “ది బ్లడీ బెంచ్‌మార్క్” అనే ట్యాగ్‌లైన్‌ ఇవ్వడంతో.. ఈ ప్రాజెక్ట్ మీద ఎప్పుడూ లేని స్థాయి అంచనాలు పెరిగాయి. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు (#Mega158, #Chiru Bobby 2) ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో మెగాస్టార్‌కి ఇది పక్కా మాస్ ఫీస్ట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.

 

Exit mobile version