NTV Telugu Site icon

Chiranjeevi : ఎన్టీఆర్‌ తెలుగు జాతి కీర్తి కిరీటం.. నా ఘన నివాళి!

Ntr Chiru

Ntr Chiru

నట సార్వభౌముడు నంద‌మూరి తారకరామరావు జ‌యంతి నేడు. ఆయ‌న శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఎన్టీఆర్ శ‌త జ‌యంతిపై స్పందిస్తున్నారు. నివాళులు అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర కథానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్‌కు జయంతి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.

‘‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి!’’ అని తెలిపారు. హస్యనట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ కూడా ఉదయం.. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి.. ఎన్టీఆర్‌ని కొనియాడుతూ వ్యాఖ్యాలు చేశారు. అంతేకాకుండా కొంత భావోద్వేగానికి గురయ్యారు.