Kaka Release: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కాకా’ చుట్టూ గత కొద్ది రోజులుగా సాగుతున్న రూమర్లకు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఊహించని రీతిలో ఫుల్‌స్టాప్ పెట్టారు. సంక్రాంతి రేసు నుంచి సినిమా తప్పుకుంటోందంటూ వస్తున్న తప్పుడు వార్తలను కొట్టిపారేస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. “రూమర్లకు, ఫేక్ న్యూస్‌కు రెస్ట్ ఇన్ పీస్.. మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు సారీ.. సంక్రాంతికి ‘కాకా’ జనవరి 13నే ల్యాండ్ అవుతున్నాడు” అంటూ ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు.
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఆసక్తికర ప్రచారం నడిచింది. చిరంజీవి నటిస్తున్న మరో భారీ చిత్రం ‘విశ్వంభర’ జనవరి 13న బాక్సాఫీస్ వద్దకు వచ్చే అవకాశాలున్నాయని, అందుకే ముందుగా అదే తేదీని లాక్ చేసుకున్న ‘కాకా’ సినిమా వెనక్కి తగ్గుతుందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మెగా వర్సెస్ మెగా క్లాష్ ఉండకూడదనే ఉద్దేశంతో విడుదల వాయిదా పడుతుందని వార్తలు అల్లారు. అయితే వాటన్నింటిని చెక్ పెడుతూ.. చెప్పిన ముహూర్తానికే, అంటే జనవరి 13నే పక్కాగా థియేటర్లలోకి అడుగుపెడుతున్నామని కోన వెంకట్ స్పష్టం చేశారు. “సంక్రాంతికి కాకా వస్తున్నాడు.. అసలైన పండగ తెస్తున్నాడు” అంటూ మెగా ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించారు.
బాబీ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి ‘సూపర్‌వైజర్ సత్యం / కదిరి కాళిదాస్’ అనే విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ‘అమ్ములు పాప’ పాత్రలో యువ నటి అనస్వర రాజన్ నటిస్తుండగా, నివేదా పేతురాజ్ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ రోల్‌లో మెరవనున్నారు. కాకా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి బరి నుంచి తప్పుకునేది లేదని తేల్చిచెప్పడంతో మెగా అభిమానులు మస్త్ ఖుషీ అవుతున్నారు.
Once again – Rest in Peace all the rumours, all fake news, all the baseless articles about “KAAKA” –
Sorry to disappoint you but we are landing on Jan 13th 🚀సంక్రాతికి “కాకా” వస్తున్నాడు 🔥
అసలైన పండగ తెస్తున్నాడు 🕺@dirbobby @KvnProductions https://t.co/M1q3I9QH4g
— KONA VENKAT (@konavenkat99) November 6, 2026

