చిరంజీవి – శ్రీదేవీ జంటగా నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మే9, 1990లో రిలీజైన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఇప్పుడు దాన్ని 2డీ, 3డీ వెర్షన్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు బాగానే హడావిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ శ్రీదేవిని ఉద్దేశిస్తూ మెగాస్టార్ చిరును ఆసక్తికరమైన ప్రశ్నను అడిగారు. అందుకు చిరంజీవి ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా వైరల్ అవుతోంది. ఇంతకి ఏంటా ప్రశ్న ..? ఏంటా సమాధానం అంటే..
Also Read: Ileana : నా పిల్లల్ని దానికి దూరంగా పెంచుతాను..
ఇందులో భాగంగా సందీప్ రెడ్డి వంగ ‘జగదేక వీరుడు’ చిత్రంలో శ్రీదేవికి కూడా మీ పాత్రకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చారు.. టైటిల్ లో కూడా శ్రీదేవికి సగభాగం అందించారు. అయితే ఆ చిత్రంలో శ్రీదేవి పాత్ర ముఖ్యమైనదని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి చిరు బదులు ఇస్తూ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి శ్రీదేవి పాత్ర ఎంతో ముఖ్యమైనది. కావాలంటే నేను కాకపోతే మరో జగదేక వీరుడు దొరికే అవకాశం ఉంటుంది కానీ, అతిలోక సుందరి అనే పాత్రకు మాత్రం శ్రీదేవి తప్ప భూమ్మీద ఎవరూ సరిపోరు. ఆమె అతిలోక సుందరిగా బిరుదు పొందేందుకే’ పుట్టింది’ అని చెప్పుకొచ్చారు. ప్రజంట్ వీరిద్దరికి సంబంధించిన ఈ సంబాషన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
