NTV Telugu Site icon

Acharya-Akhanda: చిరు, బాలయ్య పోటీలో సెంటిమెంట్స్!

Akhanda Acharya

Akhanda Acharya

Acharya-Akhanda: మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ అసలు సిసలు బాక్సాఫీస్ వార్ లో పోటీపడ్డ హీరోలని ప్రతీతి. అంతకు ముందు యన్టీఆర్, ఏయన్నార్ స్థాయిలోనే వీరి చిత్రాల మధ్య కూడా పోటీ సాగుతూ ఉంటుంది. అందుకనే తెలుగు సినిమా రంగంలో బాలయ్య, చిరంజీవినే అసలైన స్టార్ హీరోస్ అనీ అంటూ ఉంటారు. వీరిద్దరూ మరోమారు బాక్సాఫీస్ బరిలో ఢీ కొనబోతున్నట్టు సమాచారం. బాలకృష్ణ తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’తో చిరంజీవి కొత్త సినిమా ‘వాల్తేరు వీరయ్య’ పోటీకి సై అంటోంది. ఈ రెండు చిత్రాలూ సంక్రాంతి బరిలో ఢీ కొంటాయని తెలుస్తోంది. చిత్రమేమిటంటే, ఈ రెండు సినిమాలను ‘మైత్రీ మూవీమేకర్స్’ సంస్థ నిర్మించడం! ఇలా ఒకే సంస్థ ఇద్దరు టాప్ స్టార్స్ తో చిత్రాలను నిర్మించి, వాటిని ఒకే సమయంలో విడుదల చేస్తూ ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Read also: Tammineni Sitaram: అది రైతుల యాత్ర కాదు.. బినామీ యాత్ర

బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ ‘వీరసింహారెడ్డి’ కాగా, చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రెండు చిత్రాల టైటిల్స్ ‘వ’ అక్షరంతో మొదలయ్యేవే కావడం గమనార్హం! ఇంతకు ముందు బాలకృష్ణ ‘అఖండ’, చిరంజీవి ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద ఏకకాలంలో పోటీ పడక పోయినా, రెండు చిత్రాల టైటిల్స్ ‘అ, ఆ’లతో మొదలు కావడం వల్ల చర్చ సాగింది. ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిందే. అదే తీరున ఇప్పుడు కూడా ‘వా, వీ’ అక్షరాలపై జనం చర్చించుకుంటూ ఉండడం విశేషం! ఇక్కడే మరో ఆసక్తికర చర్చ సాగుతోంది. అదేమిటంటే వర్ణమాలలో ‘అ’ తరువాతే ‘ఆ’ వస్తుంది. కాబట్టి, ముందుగా ‘అ’ అక్షరంతో వచ్చిన ‘అఖండ’ ఘనవిజయం సాధించిందని అంటున్నారు. అదే తీరున ఇప్పుడు ‘వ’ గుణితంలో ముందుగా ‘వా’ వచ్చి, ఆ తరువాతే ‘వీ’ వస్తుంది. ఈ తీరున చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ను ముందుగా విడుదల చేస్తే, అది ‘వీరసింహారెడ్డి’ కన్నా మిన్నగా విజయం సాధిస్తుందని కొందరి జోస్యం! సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాలు ముందు వచ్చినా, తరువాత వచ్చి బాలయ్య సినిమాలు విజయం సాధించిన దాఖలాలూ ఉన్నాయనీ మరికొందరు గుర్తు చేస్తున్నారు. మరి ఈ రెండు సెంటిమెంట్స్ లో ఏది నిజమవుతుందో చూడాలి.
Uterine cancer: గర్భాశయ క్యాన్సర్లకు కారణం అవుతున్న హెయిర్ స్టైలింగ్ రసాయనాలు..