Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Chinmayi Fires Back At Reporters Question

Chinmayi Sripada : మీ పని మీరు చూసుకోండి.. రిపోర్టర్ పై చిన్మయి ఫైర్

Published Date :August 11, 2025 , 1:36 pm
By Mounika
Chinmayi Sripada : మీ పని మీరు చూసుకోండి.. రిపోర్టర్ పై చిన్మయి ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళ స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అనేక హిట్‌ సినిమాలకు తన గాత్రాన్ని అందించి, తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలువురు ప్రముఖ హీరోయిన్లకు డబ్బింగ్‌ చెప్పి మంచి పేరు సంపాదించింది. ఒకవైపు ప్రొఫెషన్‌లో బిజీగా ఉండి, మరోవైపు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై బహిరంగంగా స్పందిస్తూ ఉంటుంది. అయితే, ఈ ధైర్యమైన వైఖరి కొన్ని సార్లు ఆమెను వివాదాల్లోకి లాగుతుంది. ఇందులో భాగంగా తాజాగా చిన్మయి మరోసారి వార్తల్లో నిలిచింది.

Also Read : Venkatesh Maha : ‘కేరాఫ్ కంచరపాలెం’ డైరెక్టర్‌తో సత్యదేవ్ న్యూ ప్రాజెక్ట్

తాజాగా యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో, చిన్మయి “అల్టిమేట్ దివా సింగర్” అవార్డు అందుకుంది. అవార్డు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చిన్మయి, మొదట ప్రశ్నలకు ఓర్పుతో సమాధానాలు ఇచ్చింది. అయితే, ఒక విలేకరి వేసిన ప్రశ్న ఆమె‌ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దానికి ప్రతిస్పందిస్తూ.. ‘నన్ను ఏడు సంవత్సరాలు ఇండస్ట్రీకి బ్యాన్ చేశారు. కనీసం డబ్బింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పట్లో నేను ఎవరినీ ప్రశ్నించ లేక పోయాను. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారా?’అంటూ ఘాటుగా స్పందించింది. అంతేకాదు.. ‘మీ పని మీరు చూసుకోండి’ అనేలా వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్మయి గతంలో కూడా పలు సందర్భాల్లో వివాదాలకు గురైన విషయం తెలిసిందే. ఈసారి ఈ ఘటన ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chinmayi Filmfare awards
  • Chinmayi industry ban
  • Chinmayi reporter incident
  • Chinmayi Sripada news
  • Tollywood Latest News

తాజావార్తలు

  • Kollywood : కోలీవుడ్‌లో ఖాళీగా ఉన్న టాప్ చెయిర్.. రజనీ, విజయ్, అజిత్ తర్వాత ఆ వారసుడు ఎవరు?

  • Abhishek Sharma Unwanted Record: మొదటి బ్యాటర్‌గా.. అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు!

  • Vaibhav Sooryavanshi: వైభవ్‌కు బంపర్ ఆఫర్! బీసీసీఐ సంచలన నిర్ణయం.. సచిన్ రికార్డుకు ఎసరు!!

  • Vikram : విక్రమ్ – శంకర్ మళ్ళీ కలుస్తున్నారు ఈసారి అదిరిపోయే కమర్షియల్ ప్లాన్!

  • Noida Protest: నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions