Site icon NTV Telugu

Chhaava: తెలుగులో ‘ఛావా’.. గీతా ఆర్ట్స్ రిలీజ్

Chhaava

Chhaava

రీసెంట్ టైమ్స్‌లో కళ తప్పిన హిందీ బాక్సాఫీసుకు ఊపిరిపోశాడు విక్కీ కౌశల్. ఛావాతో విక్కీ.. అప్ కమింగ్ సినిమాలతో వస్తున్న హీరోలకు ఆశాకిరణమయ్యాడు. అంతేనా తన పాత రికార్డులు తానే చెరిపేసి.. సరికొత్తవి సృష్టిస్తున్నాడు. రీ విక్కీ కౌశల్.. ప్రజెంట్ దేశ వ్యాప్తంగా మార్మోగిపోతున్న నేమ్. ఇప్పటి వరకు అతడి నటనా ప్రస్తానం ఒక ఎత్తు అయితే.. ఛావాతో ఆయన ఇమేజ్ ఎవరెస్ట్ తాకుతోంది. ఛావాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీని చూసి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఎమోషనల్ అవుతున్నారు. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా ఈ డ్రై సీజన్లో కూడా కోట్లు కొల్లగొడుతుంది.

Yash: హాలీవుడ్ మీద కన్నేసిన యష్

రియల్ లైఫ్ స్టోరీలకు ప్రాణంపోసి.. మరోసారి వారి ఉనికిని చాటుతున్నాడు విక్కీ కౌశల్. ఉరిలో మేజర్ విహాన్ సింగ్, సర్దార్ ఉద్దమ్‌లో ఉద్దమ్ సింగ్, శ్యామ్ బహుదూర్ లో శ్యామ్ మనేక్షాగా ఆయన నటన అద్భుతం. ఇప్పుడు శంభాజీగా టాప్ నాచ్ ఫెర్మామెన్స్. అందుకే ఆడియన్స్ ఈ సినిమాపై కాసుల వర్షం కురిపిస్తున్నారు. డైరెక్టర్ లక్ష్మన్ ఉట్కేకర్ ఛావాతో విక్కీ ఖాతాలో బ్లాక్ బస్టర్ అందించాడు. ఈ సినిమాతో ఓల్డ్ రికార్డులు చెరిపేసి సరికొత్తవి సృష్టిస్తున్నాడు విక్కీ. అందిన సమాచారం వరకు ఈ సినిమా 300 కోట్ల నెట్ కలెక్షన్లను క్రాస్ చేసి.. విక్కీ కెరీర్ లోనే హయ్యెస్ట్ నెట్ వసూలు రాబట్టుకున్న మూవీగా నిలిచింది.

ఇక్కడే కాదు.. ఓవర్సీస్‌లో కూడా సినిమా మంచి కలెక్షన్లు రాబట్టుకోగలుగుతుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 కోట్లను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఉరి పేరిట ఉన్న రికార్డులను చెరిపేసి.. హిస్టరీని క్రియేట్ చేసినట్లయ్యింది. సోలో హీరోగా విక్కీ కెరీర్‌లో ఉరి రూ. 342 కోట్లను వసూలు చేసింది. ఈ లెక్కన విక్కీ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది ఛావా. అంతేనా అత్యంత వేగంగా రూ. 300 నెట్ కలెక్షన్లు వసూలు చేసిన 8వ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఈ మంత్ ఎండింగ్ వరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్‌కు లేకపోవడంతో మరికొన్ని రికార్డులు క్రియేట్ చేసేటట్లే కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను హిందీలో చుసిన కొంత మంది తెలుగులో చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదిక పిటిషన్లు కూడా నమోదు చేశారు ఈ నేపథ్యంలో సినిమాని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది మార్చి 7వ తేదీన చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ఆ రోజు సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ చేసే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

Exit mobile version