బాలీవుడ్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్ ‘చావా’ అంచనాలను మించి రాణిస్తుంది.ఇప్పుటికే 400 కోట్లు కొల్లగొట్టి అదే రేంజ్ లో దూసుకుపోతుంది.ఫైనల్ రన్ 700 కోట్లు అనే ప్రెడిక్షన్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాపై రిలీజ్ రోజు నుండి కొన్ని నెగెటివ్ కామెంట్స్, చరిత్రని వక్రీకరించారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
చావా పై తాజా కాంట్రావర్సీ మాత్రం మరింత అగ్గిని రాజేస్తోంది. విషయం ఏంటంటే ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ ని దగ్గరే నమ్మకంగా ఉంటున్న గనోజి, కన్హోజి అనే ఇద్దరు మరాఠా వీరులు వెన్నుపోటు పొడిచినట్టు చూపించారు.శంభాజీ తమకు అధికారం అడిగితే ఇవ్వలేదు అన్న కోపంతో ఔరంగజేబుతో చేతులు కలిపి శంభాజీ యుద్దానికి సిద్దమవుతున్న సమయంలో దగ్గరుండి మొఘల్ సైన్యానికి పట్టించినట్టు చూపించారు.గనోజి, కన్హోజి ఇద్దరూ కూడా షిర్కే వంశానికి చెందిన వారు.సినిమాలో తమ కుటుంబ పెద్దలను నెగెటివ్ గా చూపించారని, దీని వల్ల తమ కుటుంబం పరువుకి భంగం వాటిల్లిందని,అందుకే ఈ సినిమా దర్శక నిర్మాతలు తమకు 100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై స్పందించిన చావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉఁటేకర్ దిగివచ్చి షిర్కే క్షమాపణలు చెప్పారు.’ఎవరిని కించపరచాలి అనేది తమ ఉద్దేశం కాదు.అందుకే ఈ సినిమాలో గనోజి, కన్హోజి పేర్లు మాత్రమే వాడాం తప్ప వారి ఇంటిపేరు కానీ,ప్రాంతం పేరు కానీ వాడలేదు అంటూ చెప్పుకొచ్చారు.మా వల్ల వారికి ఏదైనా ఇబ్బందికలిగి ఉంటే క్షమించాలని కోరారు.
అయితే ఈ క్షమాపణతో వివాదం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.శంభాజీని గనోజి, కన్హోజి పట్టించకపోతే మొఘల్ సైన్యానికి ఎలా దొరికాడు?, చరిత్రని నిజంగానే వక్రీకరించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.నిజానికి శంభాజీ మహారాజ్ అరివీర భయంకరమయిన మరాఠా పోరాట యోధుడు…కానీ ఆయన మద్యం ఎక్కువగా తీసుకునేవాడని,స్త్రీ లోలుడు అని,శివాజీ మహారాజ్ చిన్నతనంలో శంభాజీని స్వయంగా కారాగారంలో వేయించాడని కొంతమంది చెబుతున్నారు.తాను సింహాసనాన్ని అధిష్టించడం కోసం తన పినతల్లిని, ఆమె కొడుకుని కారాగారంలో వేసాడని కూడా కొన్నికథనాలు ఉన్నాయి.ఆ తర్వాత ఆమెకి మరణ శిక్ష విధించాడు అని చెబుతారు కొంతమంది.
అయితే మద్యం మత్తులో ఉన్న సమయంలో శంభాజీని మొఘల్ సైన్యం బంధించింది అని కొంతమంది వాదన.ఏది ఏమైనా? ఛత్రపతి శంభాజీ మహారాజ్ తెగువ,పోరాట పటిమ,యుద్ధ నైపుణ్యం మాత్రం అందరు ఒప్పకునితీరాలి అనేది ఎక్కవమంది అభిప్రాయం.అయితే బయోపిక్ తీస్తున్నప్పుడు,దానికి సంబందించిన పూర్తి ఆధారాలు లేనప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు తప్పవు.త్వరలో తెలుగులో రిలీజ్ కాబోతున్న చావా ఇక్కడ ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి.