విక్కీ కౌశల్ – రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ ఫిబ్రవరి 14, శుక్రవారం విడుదలవుతోంది. మామూలుగా వాలెంటైన్స్ డే అంటే ప్రేమ, శృంగార రస సినిమాలు ఎక్కువ రిలీజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ చారిత్రక కథను చెప్పే ‘ఛావా’ను ఆ డేట్ కి రిలీజ్ అనౌన్స్ చేయడంతో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానాలను ప్రేక్షకులు పటాపంచలు చేశారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 లో బాలీవుడ్ కు అతిపెద్ద ఓపెనింగ్ ఇవ్వబోతోందని అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ చూస్తే అర్ధమవుతోంది.
Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో పోలీసులు కీలక పరిణామం..
ఒక బాలీవుడ్ టికెట్ ట్రాకింగ్ సైట్ అంచనాల ప్రకారం ‘ఛావా’ అడ్వాన్స్ బుకింగ్ నెంబర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘బాడ్ యాస్ రవి కుమార్’, ‘లవ్యాప’, ‘దేవా’ అలాగే ‘స్కై ఫోర్స్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవగా, విక్కీ కౌశల్ నటించిన ఈ చిత్రం గురువారం ఉదయం వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా, విడుదలకు ముందే రూ. 9.23 కోట్లు వసూలు చేసింది. ‘ఛావా’ ‘సనమ్ తేరి కసమ్’ సినిమాతో పోటీ పడుతోంది. ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి కనీసం రూ. 11-12 కోట్ల అడ్వాన్స్ బుకింగ్‌తో వస్తుందని భావిస్తున్నారు. సహజంగానే, ప్రేమికుల రోజున జంటలు థియేటర్లకు తరలివస్తారు, కాబట్టి మంచి స్పాట్ బుకింగ్ కూడా ఉంటుంది అని అంటున్నారు.