Cherasala : ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు ‘చెరసాల’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ మీద కథ్రి అంజమ్మ సమర్పణలో కథ్రి అంజమ్మ, షికార నిర్మాతలుగా రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘చెరసాల’. ఈ చిత్రంలో శ్రీజిత్, నిష్కల, రమ్య వంటి వారు నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 11న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరెక్టర్, హీరో రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ .. ‘మంచి కాన్సెప్ట్‌తో చెరసాల చిత్రం రాబోతోంది. కథ చెప్పిన వెంటనే నిర్మాతలు ఒప్పుకున్నారు. శ్రీజిత్, నిష్కల అద్భుతంగా నటించారు. మంచి టీం ఉంటేనే మంచి సినిమాను తీయగలుగుతాం. ఓ బంధం ఎలా ఉండాలి? రిలేషన్ షిప్‌లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే పాయింట్‌ను చూపించాను. మంచి ఎమోషన్స్‌తో పాటుగా చక్కని వినోదం కూడా ఉంటుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా మా చెరసాల చిత్రం ఉంటుంది. ఏప్రిల్ 11న రాబోతోన్న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు. హీరో శ్రీజిత్ మాట్లాడుతూ .. ‘చెరసాల సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను తెలుగులోనే డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించాను. కానీ అది కుదరలేదు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా దర్శకుడు ఈ చిత్రం మీద నాలుగేళ్లు ఫోకస్ పెట్టాడు. మధ్యలో ఇతర ఆఫర్లు వచ్చినా కూడా మా సినిమా మీదే దృష్టి పెట్టాడు. నేను కన్నడలో ఇది వరకు సినిమాలు చేశాను. నన్ను నమ్మి మా దర్శకుడు నాకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలి. మా సినిమా ఏప్రిల్ 11న రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
Also Read
- Tags
- Cherasala
- Cherasala News
తాజావార్తలు
-
Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!