తమిళ సీనీ నటి కస్తూరి మరో సారి వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. తమిళనాడు బీజేపీ మహిళా నాయకురాలుగా నటి కస్తూరి ఆ పార్టీ నిర్వహించిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. కస్తూరి మాట్లాడుతూ ” రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..?’ అని పరోక్షంగా ద్రావిడ సిద్ధాంత వాదులను ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారన్నారు. ‘ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు, ఇతరుల భార్యలపై మోజుపడొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దు.. అని బ్రాహ్మణులు చెబుతున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోంది’ అని కస్తూరి పేర్కొన్నారు.
Shocking speech from actress kasthuri against Telugu speaking people pic.twitter.com/fcuQDtckwM
— Prakash (@Hereprak) November 4, 2024