Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్ .. చిరు – బాబి మూవీ ఓపెనింగ్‌లో ‘మెగా’ హ్యాపీనెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega brothers at Mega158 Launch: మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన నటులను ఒకే ఫ్రేమ్‌లో చూస్తే ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ప్రస్తుతం మెగా అభిమానుల పరిస్థితి అదే. ఒకే ఫ్రేమ్‌లో మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా బ్రదర్ నాగబాబు కనిపించే సరికి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. నిజానికి చిరు – బాబి కొత్త సినిమా ఓపెనింగ్ కార్యక్రమం అనేది కేవలం ఒక సినిమా ఓపెనింగ్ మాత్రమే కాదు.. మెగా అభిమానులకు కండ్లారా చూసి తరించే ఒక అద్భుతమైన పండగ రోజని చెప్పాలి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబి కాంబినేషన్లో తెరకెక్కబోయే ప్రతిష్టాత్మక చిత్రం #Mega158 పూజా కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
చాలాకాలం తర్వాత ఒకే ఫ్రేమ్‌లో ‘ముగ్గురు అన్నదమ్ములు’
మెగా ఫ్యాన్స్ గత కొన్నేళ్లుగా దేనికోసమైతే వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారో.. ఆ అపురూప దృశ్యం ఈ వేదికపై ఆవిష్కృతమైంది. ఈ చిత్ర ముహూర్తపు వేడుకకు మెగాస్టార్ సోదరుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. చాలాకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు.. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఫ్రేమ్‌లో నవ్వుతూ కనిపించడంతో ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి - బాబి కొత్త సినిమా ఓపెనింగ్‌కు అతిథులుగా ఆ ఇద్దరూ!
- NTR : ఎన్టీఆర్ 'బాల రామాయణం' కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్‌స్టార్ తెలుగులో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6’ స్ట్రీమింగ్!
మెగాస్టార్ చిరంజీవి బాబి సినిమా ఓపెనింగ్
చాలాకాలం తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ముగ్గురు అన్నదమ్ములు
పండుగ చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్#MegaBrothers #Chiranjeevi #PawanKalyan #Nagababu #Mega158 #ChiruBobby2 pic.twitter.com/GrQ6Z54xDp
— NTV Breaking News (@NTVJustIn) May 21, 2026
తాజావార్తలు
-
Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్ .. చిరు – బాబి మూవీ ఓపెనింగ్‌లో ‘మెగా’ హ్యాపీనెస్
-
Ajinkya Rahane: “మా విజయ రహస్యం ఇదే”.. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!